Forex reserves: $674.66 బిలియన్లకు చేరుకున్న ఫారెక్స్ నిల్వలు

by Harish |
Forex reserves: $674.66 బిలియన్లకు చేరుకున్న ఫారెక్స్ నిల్వలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు ఆగస్టు16 తో ముగిసిన వారంలో $4.5 బిలియన్లు పెరిగి $674.66 బిలియన్లకు చేరుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటాలో వెల్లడైంది. అంతకు ముందు వారంలో నిల్వలు $4.8 బిలియన్లు తగ్గి $670.11 బిలియన్లకు చేరుకున్నాయి. దానికి ముందు ఆగస్టు 2 తో ముగిసిన వారంలో నిల్వలు రికార్డు స్థాయిలో 674.92 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం, ఆగస్టు 16తో ముగిసిన వారంలో, విదేశీ కరెన్సీ ఆస్తులు, నిల్వలలో ప్రధాన భాగం, $3.609 బిలియన్లు పెరిగి 591.569 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

సమీక్ష వారంలో బంగారం నిల్వలు 865 మిలియన్ డాలర్లు పెరిగి 60.104 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ తెలిపింది. అదే సమయంలో ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు (SDRలు) $60 మిలియన్లు పెరిగి $18.341 బిలియన్లకు చేరుకున్నాయి. IMFలో భారతదేశ రిజర్వ్ స్థానం ఈ వారంలో 12 మిలియన్ డాలర్లు పెరిగి 4.65 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆగస్టు 16తో ముగిసిన వారంలో, రూపాయి స్థిరంగా ఉన్నట్లు కనిపించింది. రూపాయిని నిలబెట్టుకోవడంలో సహాయపడటానికి ఆర్‌బీఐ ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా జోక్యం చేసుకుంటుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed