- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు నెలల కనిష్ట స్థాయికి ఫారెక్స్ నిల్వలు
ముంబై: దేశంలో విదేశీ మారక ద్రవ్య(ఫారెక్స్) నిల్వలు మార్చి 10 తో ముగిసిన వారానికి 2.39 బిలియన్ డాలర్లు తగ్గి మూడు నెలల కనిష్ట స్థాయి 560.003 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఇండియా తన వీక్లీ నివేదికలో పేర్కొంది. ఇంతకుముందు మార్చి 3తో ముగిసిన వారంలో నిల్వలు 1.46 బిలియన్ డాలర్లు పెరిగి 562.40 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన, సమీక్షిస్తున్న వారంలో నిల్వలు 47.31 బిలియన్ డాలర్లు తగ్గాయని, అదే ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికన 62.23 బిలియన్ డాలర్లు పడిపోయాయని ఆర్‌బిఐ తెలిపింది.
భారతదేశ విదేశీ కరెన్సీ ఆస్తులు దాదాపు 2.2 బిలియన్ డాలర్లు తగ్గి 494.86 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. మార్కెట్‌లో రూపాయి అస్థిరతను అరికట్టడానికి ఆర్‌బిఐ డాలర్లను విక్రయించడం ద్వారా రిజర్వ్ నష్టాలు పెరిగాయి. రూపాయి ఒత్తిడికి లోనవుతున్నందున నిల్వలు గరిష్ట స్థాయి నుండి పడిపోతున్నాయి. తీవ్ర అస్థిరత నుండి రూపాయిని రక్షించడానికి ద్రవ్య అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.
దేశంలో మార్చి 10 నాటికి బంగారు నిల్వలు $110 మిలియన్లు తగ్గి $41.92 బిలియన్లుగా ఉన్నాయి. అలాగే, SDR హోల్డింగ్‌లు కూడా $53 మిలియన్లు పడిపోయి $18.12 బిలియన్లకు చేరుకున్నాయి. దేశం రిజర్వ్ స్థానం IMFలో $11 మిలియన్లు తగ్గి $5.1 బిలియన్లకు చేరుకుంది.
Also Read...