Forbes India List: ఫోర్బ్స్ ఇండియా సంపన్నుల జాబితాలో మళ్లీ మొదటి ప్లేస్‌లోకి ముకేశ్ అంబానీ

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-10 12:07:27.0  )
Forbes India List: ఫోర్బ్స్ ఇండియా సంపన్నుల జాబితాలో మళ్లీ మొదటి ప్లేస్‌లోకి ముకేశ్ అంబానీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ కుబేరుడు, రిలియన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani) భారతీయ ధనవంతుల జాబితాలో మరోసారి టాప్ ప్లేస్(Top place)ను సొంతం చేసుకున్నారు. ఫోర్బ్స్(Forbes తాజాగా విడుదల చేసిన ఇండియాలోని 100 మంది సంపన్నుల జాబితాలో అతడు అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాది టాప్-100లో చోటు సంపాదించిన సంపన్నులు సంపద మొదటిసారి నికర విలువ(Net Worth)లో ట్రిలియన్ డాలర్లు దాటినట్లు ఫోర్బ్స్ నివేదిక పేర్కొంది. కాగా గత సంవత్సరంతో పోల్చుకుంటే అంబానీ సంపద 27.5 బిలియన్ డాలర్లు పెరిగి 119.5 బిలియన్లకు చేరుకుంది. ప్రస్తుతం ముకేశ్ అంబానీ నికర విలువ 108.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన 13వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ఈ జాబితాలో 116 బిలియన్‌ డాలర్లతో గౌతమ్ అదానీ(Gautham Adani) రెండో స్థానంలో నిలిచారు. 43.7 బిలియన్ డాలర్లతో సావిత్రి జిందాల్(Savitri Jindal) మూడో స్థానంలో ఉండగా.. శివ్ నాడార్(Shiv Nadar) 40.2 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో నిలిచారు. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఛైర్మన్(Sun Pharmaceutical Industries Chairman) దిలీప్ షాంఘ్వీ(Dilip Shanghvi) ఈ సంవత్సరం 32.4 బిలియన్ డాలర్లతో మూడు స్థానాలు ఎగబాకి 8 నుంచి 5వ స్థానానికి చేరుకున్నారు.

భారతదేశంలోని టాప్ 10 ధనవంతులు:

1) ముఖేష్ అంబానీ; 119.5 బిలియన్ డాలర్లు 2) గౌతమ్ అదానీ; 116 బిలియన్ డాలర్లు 3) సావిత్రి జిందాల్; 43.7 బిలియన్ డాలర్లు 4) శివ్ నాడార్; 40.2 బిలియన్ డాలర్లు 5) దిలీప్ షాంఘ్వీ; 32.4 బిలియన్ డాలర్లు 6) రాధాకిషన్ దమాని; 31.5 బిలియన్ డాలర్లు 7) సునీల్ మిట్టల్; 30.7 బిలియన్ డాలర్లు 8) కుమార్ మంగళం బిర్లా; 24.8 బిలియన్ డాలర్లు 9) సైరస్ పూనావాలా; 24.5 బిలియన్ డాలర్లు 10) బజాజ్ ఫ్యామిలీ; 23.4 డాలర్లు బిలియన్

Advertisement

Next Story

Most Viewed