LPG Gas : మహిళలకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

by Bhoopathi Nagaiah |
LPG Gas : మహిళలకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
X

దిశ,వెబ్ డెస్క్: ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో NDA కూటమి మూడవ సారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. ఈ క్రమంలో మధ్య తరగతి ప్రజలకు మోడీ సర్కార్ మరో శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం ఎన్నికలకు ముందు ప్రధాన్‌ మంత్రి ఉజ్వల యోజన పథకం కింద LPG సిలిండర్లపై రూ.300 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరుణంలో ఈ సబ్సిడీ పథకం మరో ఎనిమిది నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని కేంద్ర వర్గాల ద్వారా సమాచారం.

ప్రస్తుత హైదరాబాద్ రీజియన్ పరిధిలో గ్యాస్ సిలిండర్ ధర 885 రూపాయలుగా ఉంది. కేంద్రం మరోసారి ఈ పథకాన్ని పొడగిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో లబ్దిదారులకు 555 రూపాయలకే LPG గ్యాస్ సిలిండర్ లభించనుంది. ఈ లెక్కన కేంద్ర మంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధిదారులు మార్చ్ 31 ,2025 వరకు LPG సిలిండర్లపై రూ.300 సబ్సిడీని పొందుతారు. కేంద్రం లబ్ధిదారులకు ప్రతి ఏడాది ఈ పథకం కింద 12 రీఫిల్స్ సరఫరా చేస్తుంది. 14.2 కిలోల సిలిండర్‌పై మాత్రమే రూ.300 సబ్సిడీ లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. ప్రస్తుతం ఈ స్కీం లబ్ధిదారుల సంఖ్య దాదాపు 9 కోట్లకు పైగా ఉంది. కట్టెల పొయ్యి బాధ నుంచి మహిళల ఆరోగ్యం కాపాడటం, శుభ్రమైన వంట వైపు పేద కుటుంబాలను తీసుకురావడం ఈ ఉజ్వల యోజన పథకం యొక్క ముఖ్య లక్షణం.

Advertisement

Next Story

Most Viewed