- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరుసగా మూడో రోజు కొత్త రికార్డు స్థాయిలకు చేరిన సూచీలు
ముంబై: షేర్ మార్కెట్లలో వరుస రికార్డులు నమోదవుతున్నాయి. దేశీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగడం, గ్లోబల్ మార్కెట్లలో ముడి చమురు ధరలు దిగి వస్తుండటం వంటి పరిణామాలు మార్కెట్ల ర్యాలీకి దోహదపడ్డాయి. ప్రధానంగా అమెరికా వడ్డీ రేట్లలో కోతలు ఉండొచ్చనే సంకేతాలు, దేశీయంగా కీలక ఎనర్జీ, ఐటీ రంగాల్లో కొనుగోళ్ల కారణంగా బుధవారం సూచీలు వరుసగా మూడో రోజు సరికొత్త రికార్డు గరిష్టాలను సాధించాయి.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 357.59 పాయింట్లు లాభపడి 69,653 వద్ద, నిఫ్టీ 82.60 పాయింట్లు పెరిగి 20,937 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో విప్రో, ఐటీసీ, ఎల్అండ్‌టీ, టీసీఎస్, టాటా మోటార్స్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం కంపెనీల షేర్లు లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రా సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకి, భారతీ ఎయిర్‌టెల్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.34 వద్ద ఉంది.