Bank Holidays : ఖాతాదారులకు అలర్ట్.. సెప్టెంబర్‌లో బ్యాంకులకు ఎన్నిరోజులు సెలవు అంటే ?

by samatah |   ( Updated:2022-08-25 05:32:03.0  )
Bank Holidays : ఖాతాదారులకు అలర్ట్.. సెప్టెంబర్‌లో బ్యాంకులకు ఎన్నిరోజులు సెలవు అంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. చాలా మంది కస్టమర్లకు బ్యాంకు సెలవు దినాలు తెలియక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని సార్లు ముఖ్యమైన పనులు కూడా వాయిదా పడే అవకాశం ఉంది. అందువలన ముదస్తుగా బ్యాంకులు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకుంటే సమస్యలు తగ్గే అవకాశం ఉంది. అందువులన ఇప్పుడు మనం సెప్టంబర్‌ నెలలో బ్యాంకుల సెలవు దినాల గురించి తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకుల సెలవు దినాల ప్రకటనను విడుదల చేస్తుంది. అలాగే సెప్టంబర్ నెలలోని సెలవు దినాల జాబితాను విడుదల చేసింది. శని, ఆది వారాలతో కలిసి నెలలో మొత్తం 13 రోజులకు బ్యాంకులకు సెలవులున్నాయి. ఇది అన్నిరాష్ట్రాలను కలిపి. రాష్ట్రాలను బట్టీ సెలవు దినాలు మారుతాయి.

సెలవు దినాలు

సెప్టెంబర్‌ 1న : వినాయక చవితి

సెప్టెంబర్ 4న : ఆదివారం

సెప్టెంబర్‌ 6న : జార్ఖండ్‌లో కర్మపూజ పేరుతో బ్యాంకులకు సెలవులు,

సెప్టెంబర్‌ 7,8 : కేరళలో ఓనం పండగ,

సెప్టెంబర్ 9న : సిక్కిం, గ్యాంగ్‌టక్‌లో ఇంద్రజాత సెలవు

సెప్టెంబర్10న : రెండో శనివారం, శ్రీ నరవణ గురు జయంతి సందర్బంగా కేరళలో బ్యాంకులకు సెలవు

సెప్టెంబర్ 11న : ఆదివారం

సెప్టెంబర్ 18న : ఆదివారం

సెప్టెంబర్‌ 21న : కేరళలో శ్రీనారాయణ గురు సమాధి దినం

సెప్టెంబర్ 24న :నాలుగవ శనివారం

సెప్టెంబర్ 25న : ఆదివారం

సెప్టెంబర్‌ 26న : నవరాత్రి స్థాపన కారణంగా మణిపాల్‌, రాజస్థాన్‌లో బ్యాంకులకు సెలవు

Advertisement

Next Story