Air India: ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమానా!

by Harish |   ( Updated:2022-06-14 13:18:29.0  )
DCGA Fines Air India 10 Lakh For Denying Boarding To Passengers With Valid Tickets
X

న్యూఢిల్లీ: DCGA Fines Air India 10 Lakh For Denying Boarding To Passengers With Valid Tickets| దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) భారీ జరిమానా విధించింది. ప్రయాణికుల వద్ద సరైన ఆధారిత టికెట్లు ఉన్నప్పటికీ బోర్డింగ్ నిరాకరించినందుకు ఈ జరిమానా చర్యలు తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది. వినియోగదారులు చెల్లుబాటు అయ్యే టికెట్లు ఉండి, వారు నిర్దేశించిన సమయానికి అందజేసినప్పటికీ బోర్డింగ్‌ను నిరాకరించిన ఘటనలపై వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని డీజీసీఏ తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలోనే మార్గదర్శకాలను పలు విమానయాన సంస్థలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

బోర్డింగ్ వైఫల్యంపై వివరణ కోరినప్పటికీ ఎయిర్ ఇండియా సరైన రీతిలో సమాధానం ఇవ్వలేదు. తిరస్కరణకు గురైన ప్రయాణికులు గంట వ్యవధిలోనే ప్రత్యామ్నాయానికి అవకాశం ఉన్నప్పటికీ ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంగా ఉండటం, నష్టపరిహారం చెల్లింపునకు సంబంధించిన పాలసీ లేదని చెప్పడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని డీజీసీఏ జరిమానా విధించింది. మార్గదర్శకాల ప్రకారం బోర్డింగ్ నిరాకరించిన 24 గంటల వ్యవధిలో విమాన ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలి. లేదా రూ. 10 వేల పరిహారం చెల్లించాలి. 24 గంటలు దాటితే కనుక రూ. 20 వేల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని డీజీసీఏ పేర్కొంది. అదేవిధంగా ఈ సమస్యకు సంబంధించి తక్షణమే పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని డీజీసీఏ హెచ్చరించింది.

Advertisement

Next Story

Most Viewed