Adani-Hindenburg: హిండెన్‌బర్గ్ ఆరోపణలపై స్పందించిన అదానీ గ్రూప్

by Harish |
Adani-Hindenburg: హిండెన్‌బర్గ్ ఆరోపణలపై స్పందించిన అదానీ గ్రూప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: సెబీ చీఫ్ మాధబి పురి బచ్, ఆమె భర్త ధవర్ బచ్‌లకు అదానీ గ్రూపులో వాటాలు ఉన్నాయని అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలను అదానీ గ్రూపు తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు దురుద్దేశ పూరితమైనవి, వ్యక్తిగత లాభం పొందడానికి, పెట్టుబడిదారులు, ప్రజలను తప్పుదారి పట్టించడానికి హిండెన్‌బర్గ్ ప్రయత్నిస్తుందని ఆ గ్రూప్ అధికార ప్రతినిధి అన్నారు. గతంలో హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై పారదర్శక విచారణ జరిగింది. అవన్నీ కూడా నిరాధారమైనవని తేలింది. సుప్రీంకోర్టు సైతం పూర్తి విచారణ జరిపి మా గ్రూపుపై చేసిన ఆరోపణలు అసత్యం అని పేర్కొంది. అయినప్పటికి కూడా హిండెన్‌బర్గ్ పదేపదే నిరాధారమైన ఆరోపణలు చేస్తుందని అధికార ప్రతినిధి అన్నారు.

మా విదేశీ కంపెనీల నిర్వహణ పూర్తి పారదర్శకంగా ఉంది, గ్రూప్‌కు సంబంధించిన అన్ని వివరాలను క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతామని, మా సంస్థకు ఎవరితో వాణిజ్య సంబంధాలు లేవంటూ పరోక్షంగా సెబీ చీఫ్‌/ఆమె భర్త ధవల్‌ను ఉద్దేశించి అన్నారు. అన్ని చట్టపరమైన, నియంత్రణ అవసరాలకు అనుగుణంగా వ్యాపార నిర్వహణకు కట్టుబడి ఉన్నాము, కంపెనీ ప్రతిష్టను దెబ్బతీయడానికే అమెరికన్ కంపెనీ ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తుందని అదానీ గ్రూప్ తెలిపింది.

ఇదిలా ఉంటే హెండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై సెబీ చీఫ్, ఆమె భర్త మాట్లాడుతూ, ఇవన్నీ నిరాధారమైనవి. మాపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. అందులో నిజం లేదు. మా జీవితం తెరిచిన పుస్తకం అని అన్నారు. అంతకుముందు శనివారం ఉదయం ‘సమ్‌‌థింగ్ బింగ్ సూన్ ఇండియా’ అని ఎక్స్‌లో పోస్ట్ చేసిన హిండెన్‌బర్గ్, గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్‌షోర్‌ బెర్ముడా, మారిషస్‌ ఫండ్‌లు ఉన్నాయని, వీటిలో మాధబి పురి, ఆమె భర్త ధావల్‌ బచ్‌లకు వాటాలు ఉన్నాయని, వీటి విలువ దాదాపు రూ.83 కోట్లు అని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed