ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో భారీగా పెరిగిన పెట్టుబడులు!

by Harish |
mutal funds
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొంతకాలంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఏడాది నవంబర్‌లో ఈ రకమైన పెట్టుబడులు రూ. 11,615 కోట్లకు పెరిగాయి. ఇటీవల మార్కెట్లు ఊగిసలాట ధోరణిలో ఉన్నప్పటికీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) రూపంలో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు అత్యధికగా వచ్చాయి. దీంతో ఈ ఏడాది జూలైలో రూ. 25,000 కోట్ల తర్వాత ఈ విభాగంలో అత్యధిక పెట్టుబడులు నవంబర్‌లో రావడం గమనార్హం.

ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో మొత్తం రూ. 5,215 కోట్లు రాగా, సెప్టెంబర్‌లో రూ. 8,677 కోట్లు, ఆగష్టులో రూ. 8,666 కోట్ల నికర పెట్టుబడులు నమోదయ్యాయి. ఈ క్రమంలో అన్ని రకాల పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు మొత్తం రూ. 46,165 కోట్లుగా ఉన్నాయి. తద్వారా నవంబర్ ఆఖరు నాటికి ఫండ్స్ పరిశ్రమ ఆస్తుల విలువ రూ. 38.45 లక్షల కోట్లకు పెరిగింది. విభాగాల వారీగా పరిశీలిస్తే.. ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్స్‌లోకి రూ. 9,422 కోట్లు, ఫ్లెక్సిక్యాప్ ఫండ్స్‌లోకి రూ. 2,660 కోట్లు, సిప్‌ల రూపంలో రూ.11,005 కోట్లు, గోల్డ్ ఈటీఎఫ్ పథకాల్లోకి రూ. 682 కోట్లు, రుణ పథకాల్లో రూ. 14,893 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed