తారు రోడ్డు వ్యవహారంలో ‘ఎమ్మెల్యే బావ’పై బహిరంగంగా మండిపడ్డ ‘బామ్మర్దులు’

by Shyam |   ( Updated:2021-08-25 08:20:55.0  )
తారు రోడ్డు వ్యవహారంలో ‘ఎమ్మెల్యే బావ’పై బహిరంగంగా మండిపడ్డ ‘బామ్మర్దులు’
X

దిశ, నాగర్ కర్నూల్ : నియోజకవర్గంలో అభివృద్ధి కుంటు పడిపోయినా స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వేదికల మీద గొప్పలు చెప్పుకుంటున్నారని, ప్రశ్నించిన వారిని బామ్మర్దులు అంటూ హేళన చేయడం వారి అహంకారానికి నిదర్శనమని బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి కుమార్ మండిపడ్డారు. మంగళవారం బోనాల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై, పేద ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిని దిశ పత్రిక వెలుగులోకి తెచ్చింది. కాగా, దీనిపై బీఎస్పీ నేతలు స్పందించారు. ఎమ్మెల్యే బావగారూ ఎక్కడ ఉన్నారు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. సామాన్యులను చులకన భావంతో బామ్మర్దులు అంటూ సంభోదించిన మీరు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాడూరు మండలం చర్ల ఇటిక్యాలలో నాసిరకంగా వేస్తున్న తారు రోడ్డు పనులను పరిశీలించారు. డబ్బులు మిగిలించుకోవాలనే కక్కుర్తితో నాసిరకంగా నిర్మిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మెనూచౌదరికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Advertisement

Next Story