బీపీసీఎల్‌లో వాటా కొనుగోలుకు వేదాంత గ్రూప్ సిద్ధం!

by Harish |
బీపీసీఎల్‌లో వాటా కొనుగోలుకు వేదాంత గ్రూప్ సిద్ధం!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ బీపీసీఎల్‌లో వాటాను కొనుగోలు చేయడానికి వేదాంత గ్రూప్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబందించి ఆ సంస్థ ఆసక్తిని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఒప్పందం కోసమని ఈక్విటీ విధానంలో 8 బిలియన్ డాలర్లను సేకరించాలని ప్రయత్నిస్తోంది. దీనికోసం బ్యాంకులతో చర్చలను మొదలుపెట్టింది. ‘ప్రస్తుతం ఉన్న చమురు వ్యాపారాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో బీపీసీఎల్ వాటాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నామని’ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. వేదాంత గ్రూప్ ఇప్పటికే బీపీసీఎల్‌లో 52.98 శాతం వాటా కొనుగోలుకు ఆసక్తిని వ్యక్తం చేసింది.

వేదాంత ఇదివరకు 8 బిలియన్ డాలర్లను వెచ్చించి కెయిర్న్ ఇండియాలో వాటాలను కొనుగోలు చేసింది. ఈ సంస్థ రాజస్థాన్‌‌లో చమురు క్షేత్రాలను నిర్వహిస్తోంది. ఆ క్షేత్రం నుంచి బీపీసీఎల్‌తో పాటు వివిధ కంపెనీలు చమురును వినియోగిస్తున్నాయి. తద్వారా పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. వేదాంత కంపెనీ బీపీసీఎల్ కొసం సుమారు 10 బిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బీపీసీఎల్‌లో వాటాలను కొనుగోలు చేయడం ద్వారా వేదాంత గ్రూప్ సంస్థ భారత్‌లో విస్తరణను పెంచుకునే వీలుంది.

Advertisement

Next Story

Most Viewed