ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేయబోయి..బాలుడి మృతి

by Shyam |
ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేయబోయి..బాలుడి మృతి
X

దిశ, వరంగల్: ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేయబోయి ప్రమాదానికి గురయ్యారు.ఇందులో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు.ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి మండలం నాగారం వద్ద మంగళవారం చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం..నగరంలోని కాశిబుగ్గకు చెందిన విఘ్నేష్​(14), మరో ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లారు. ఆ సమయంలోనే నాగారం వద్ద ట్రాక్టర్​ను ఓవర్​టేక్​ చేసేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలోనే బైకు పైన చివరలో కూర్చున విఘ్నేష్​కు ట్రాక్టర్ బాడీ తగలడంతో ట్రాక్టర్ టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా, స్థానికులు వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

Advertisement

Next Story