శ్రీవారి ఆస్తులు వాటికే ఉపయోగించాలి

by srinivas |
శ్రీవారి ఆస్తులు వాటికే ఉపయోగించాలి
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి కానుకలను ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని తెలిపారు. శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు. అంతేగాకుండా సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని సత్యకుమార్‌ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed