- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్రమ మద్యం తరలిస్తూ బీజేపీ నేత అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో అక్రమ మద్యం తరలింపులు, నిల్వలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్రమార్కులపై ప్రత్యేక నిఘా వేశారు. ముఖ్యంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి ఏపీకి అక్రమ మద్యాన్ని ఎక్కువగా తరలిస్తున్నారు. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లాలో ఏఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు చేయగా ఓ బీజేపీ నేత మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు.
వివరాళ్లోకి వెళితే.. బీజేపీ నేత గుడివాక రామాంజనేయులు(అంజిబాబు) చిట్యాల నుంచి గుంటూరుకు మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు. మొత్తం మూడు కారుల్లో తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు చేసి అక్రమ మద్యాన్ని సీజ్ చేశారు. రూ. 6 లక్షల విలువైన 1,920 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో బీజేపీ నేత గుడివాక రామాంజనేయులు ఏ-1గా ఉన్నారు. గత ఎన్నికల్లో గుడివాక రామాంజనేయులు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం గమనార్హం.