- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారులను బదిలీ చేయించాల్సిందే.. హుజురాబాద్ ఎన్నికలపై బీజేపీ మీటింగ్
దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బీజేపీకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నాయని, ఎన్నికల వరకూ ఇదే పరిస్థితి కొనసాగే విధంగా ప్రచారం చేయాలని బీజేపీ భావిస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ప్రధాన ఎజెండాగా హుజురాబాద్ ఎన్నికల అంశమే నిలిచింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా హుజురాబాద్‌లో పట్టు సాధించే అవకాశం ఉన్నందున ఆ పార్టీకి కూడా ఎలాంటి అవకాశం చిక్కకుండా కార్యాచరణ రూపొందించుకుని ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నాటికల్లా జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు హుజురాబాద్‌లో పర్యటించి ప్రభావాన్ని మరింత బలపడే విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడింది.
అధికారులను బదిలీ చేయించాల్సిందే
ఉపఎన్నికల నాటికల్లా కరీంనగర్ జిల్లాలో పని చేస్తున్న పలువురు అధికారులను బదిలీ చేయించేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్న విషయంపై సమావేశంలో చర్చించారు. నియోజకవర్గంలో కార్యకర్తలను వేధింపులకు గురి చేసే ప్రక్రియ ప్రారంభించారని, కనీసం అద్దెకు ఇళ్లు, ఫంక్షన్ హాళ్లు బీజేపీకి ఇవ్వవద్దన్న ఒత్తిళ్లకు కూడా గురి చేస్తున్నారన్న అంశంపైనా సమావేశంలో సీరియస్ గా చర్చించారు. ప్రత్యర్థి పార్టీ ఎన్ని రకాల అడ్గంకులు ఏర్పర్చినా.. తమ లక్ష్యం మాత్రం గెలుపునన్నట్టుగా సాగాల్సిన అవసరం ఉందని నాయకులు భావించారు. అలాగే హుజురాబాద్ బై పోల్స్ దృష్టిలో పెట్టుకుని ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారుల గురించి కూడా హైకమాండ్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.