రాష్ట్రంలో టెస్టులు 3 వేలు దాటడం లేదు : రాం మాధవ్

by Shyam |
రాష్ట్రంలో టెస్టులు 3 వేలు దాటడం లేదు : రాం మాధవ్
X

దిశ, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు సరిగా లేవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ విమర్శించారు. 20 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 20 వేల కేసులుంటే 3 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో 15 వేల కేసులున్నాయని రాం మాధవ్ మండిపడ్డారు. కరోనా కట్టడికి కేంద్రం ఎంత శ్రద్ధ వహిస్తుందో రాష్ట్రాలు సైతం అంతే శ్రద్ద వహించాలని రాం మాధవ్ అన్నారు. తెలంగాణలో కరోనా టెస్టులు 3 వేలు దాటడం లేదని మండిపడ్డారు. కరోనా నుంచి ఈ మాత్రం బయట పడగాలిగామంటే సరైన సమయంలో మోదీ నిర్ణయం తీసుకోవడం వల్లనే అని రాం మాధవ్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed