హౌస్‌లోకి వచ్చిన పింకీ.. లవ్ ఎక్స్ ప్రెస్ చేసిన మానస్

by Shyam |   ( Updated:2021-12-08 00:21:59.0  )
హౌస్‌లోకి వచ్చిన పింకీ.. లవ్ ఎక్స్ ప్రెస్ చేసిన మానస్
X

దిశ, వెబ్‌డెస్క్ : బిగ్‌బాస్ 5 చివరి దశకు వచ్చేసింది. దీంతో బిగ్ బాస్.. కంటెస్టెంట్స్‌కు డిఫరెంట్ టాస్క్‌లు ఇస్తూ హౌజ్‌లో నవ్వులు పూయిస్తున్నాడు. కాగా, మంగళవారం జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ చూసిన వారు నవ్వుకోకుండా ఉండలేరు. మానస్ కామెడీ చూసి మానస్ గేమ్ స్టార్ట్ చేశారు, మానస్ సన్నీ కామెడీ మామూలుగా లేదంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో ప్రేక్షకులకు నచ్చిన ఐకానిక్ సంఘటనల్ని ఒకరి రోల్ మరొకరు ప్లే చేయాల్సి ఉంటుందని చెప్పారు బిగ్‌బాస్‌. ఎవరైతే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తారో వాళ్లకి గార్డెన్‌ ఏరియాలో స్పెషల్‌గా ఏర్పాటు చేసిన ఓటింగ్ బూత్ నుంచి ఆడియన్స్‌కి ఓటింగ్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు.

దీంతో హౌస్ మేట్స్ వారికిచ్చిన పాత్రల్లో ఇరగదీశారు. బిగ్ బాస్ 5‌లో ప్రియాంక, మానస్ ప్రయాణం గురించి టాస్క్ చేయాలని చెప్పగా, సన్నీ మానస్‌గా, మానస్ ప్రియంకగా, కాజల్ సన్నీలా, షన్ను జెస్సీలా నటించారు. ఇక ఈ పాత్రలో మానస్ నటన చాలా అద్భుతంగా ఉంది. మానస్ అచ్చం ప్రియాంకలా ప్రవర్తిస్తూ, మానస్ పై తనకున్న ప్రేమను చూపించాడు. ప్లేట్‌లో పింకి ఎలా అయితే అన్నం తీసుకొచ్చి మానస్ తిను అంటూ ఇచ్చేదో.. అచ్చం పింకీలానే మానస్ కూడ ప్లేట్‌లో రైస్ తీసుకొచ్చి, పింకీ ఎలాగైతే ఎమోషనల్‌గా అడిగేదో మానస్ కూడా అలానే ఇచ్చాడు. ఇక మానస్‌ను చూసి సన్నీ చాలా నవ్వుకున్నాడు. అచ్చం కాష్మోరా‌లా ఉన్నాడు, రాత్రి కలలకు వస్తావేమోరా.. అంటూ అందరిని నవ్వించేశాడు సన్నీ. ఇక చివరకు సన్నీ పింకీ గురించి కాజల్‌కు చెబుతూ.. కాజల్ నేను పింకీ మానస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసిందో అది చేస్తాను అని చెప్పి చేస్తాడు. మానస్‌ నుంచి పింకీ ఎలాంటి ప్రేమను ఆశించిందో అది చేసి చూపించాడు సన్నీ. పింకీ పాత్రలో ఉన్న మానస్‌ దగ్గరు వెళ్లి.. నా ప్రేమ, మన స్నేహం ఎప్పటికీ ఇలానే కొనసాగుతుంది పింకీ అని భరోసా ఇచ్చారు. ఒక ఆడపిల్ల కోరుకునేది ధైర్యం అంతే నీకు ఎప్పటికి సన్నీ అన్న నేను అండగా ఉంటాం అని చెప్తాడు సన్నీ. ఇది చూసి కాజల్‌ కనీళ్లు పెట్టుకుంది. తమ తమ క్యారెక్టర్ల నుంచి బయటకు వచ్చి ముగ్గురు గట్టిగా హగ్‌ చేసుకున్నారు.

Advertisement

Next Story