మెంటల్ హెల్త్‌పై కరోనా ప్రభావం : బిగ్‌ బీ

by Anukaran |   ( Updated:2020-07-26 03:19:30.0  )
మెంటల్ హెల్త్‌పై కరోనా ప్రభావం : బిగ్‌ బీ
X

క‌రోనా బారినప‌డ్డ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్.. రెండు వారాలుగా ముంబైలోని నానావ‌తి ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌న‌ అనుభ‌వాల‌ను ఎప్పటికప్పుడు అభిమానులకు, శ్రేయోభిలాషులకు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. తన ఆరోగ్య పరిస్థితిపై కూడా అప్‌డేట్స్ ఇస్తున్నారు. తాజాగా ఐసోలేషన్ వార్డులో తానెలా గడిపాడో తెలియజేయడంతో పాటు కొవిడ్-19 ప్రభావం.. మెంటల్ హెల్త్‌పై ఏవిధంగా ఉంటుందో వివరించే ప్రయత్నం చేశారు.

‘రాత్రి వేళలో చలికి వణుకుతున్న నేను.. నిద్రించడానికి పాటలు పాడాను. ఆ స‌మ‌యంలో నా చుట్టూ ఎవ‌రూ లేరు’ అని తన మనసులోని మాటలను రాసుకొచ్చారు. ‘ఐసోలేష‌న్ వార్డులో వారాల తరబడి ఒంట‌రిగా ఉన్న రోగిని చూసేందుకు ఏ ఒక్క మ‌నిషీ రాడు. డాక్ట‌ర్లు, న‌ర్సులు.. మెడికల్ కేర్ కోసం అతని దగ్గరికి వస్తుంటారు. కానీ వాళ్లంతా ప్రొటెక్షన్ కోసం పీపీఈ కిట్లు ధ‌రించే ఉంటారు. వారి ముఖ క‌వ‌ళికలు క‌నిపించ‌వు, వారి ఎక్స్‌ప్రెషన్స్ ఏంటో అర్థం కావు. అస‌లు వారెవ‌రో కూడా తెలీదు. ఆ తెల్ల దుస్తుల్లో, పీపీఈ కిట్లలో ఉన్న వాళ్ల‌ను చూస్తే రోబోల్లానే అనిపిస్తుంది. ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఏది కావాలో, ఏం చేయాలో చేసి వెళ్లిపోతారు. ఎక్కువ సేపు ఉంటే ఈ వైర‌స్ వ్యాప్తి చెందుతుందేమోన‌న్న భ‌యం వారినీ వెంటాడుతుంది. పైగా చికిత్స అందిస్తూ ప‌ర్య‌వేక్షించే వైద్యుడు రోగి‌ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి వెన్నుత‌ట్టి ధైర్య‌మివ్వ‌రు. వీడియో కాల్‌లోనే మాట్లాడ‌తారు. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ఇది మాత్ర‌మే ఉత్త‌మ‌మైన‌ది’ అని పేర్కొన్నారు. వైరస్ నుంచి రోగి కోలుకున్నా సరే.. ఇలా ఇన్ని రోజులుగా ఒంటరిగా ఉన్నా ఆ వ్యక్తి.. మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అవుతాడు. డీప్ డిప్రెషన్‌లో ఉండిపోతారు’ అని అమితాబ్ తన అభిప్రాయాన్ని తెలిపారు.

Advertisement

Next Story