స్మార్ట్‌ఫోన్‌లో.. ‘కలర్ మెసేజ్ యాప్’ ఉందా? అయితే డిలీట్ చేయండి!

by Shyam |   ( Updated:2021-12-20 05:15:35.0  )
android
X

దిశ, ఫీచర్స్: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు మరోసారి ‘జోకర్’ మాల్వేర్ నుంచి ముప్పు పొంచి ఉంది. 2017 నుంచి ఈ మాల్వేర్ పలు యాప్‌ల ద్వారా స్మార్ట్‌ఫోన్స్‌లోకి ఎంటర్ అవుతూనే ఉంది. ఈసారి ‘కలర్ మెసేజ్’ అనే మొబైల్ అప్లికేషన్‌లో గుర్తించగా, ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్ నుంచి 500,000 కంటే ఎక్కువ మంది దీన్ని డౌన్‌లోడ్ చేశారు. ఈ యాప్ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేసుకోవాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గేమ్, మెసెంజర్‌, ఫొటో ఎడిటర్‌, ట్రాన్స్‌లేటర్‌, వాల్‌పేపర్‌ వంటి సాధారణ అప్లికేషన్స్‌‌లో జోకర్ మాల్వేర్ దాగి ఉంటుంది. చాలా వరకు పిల్లలు డౌన్‌లోడ్ చేసే యాప్స్‌నే లక్ష్యంగా చేసుకుంటాయి. ఈ క్రమంలోనే ‘కలర్ మెసేజ్’ యాప్‌లో ఈ మాల్వేర్ ఉన్నట్లు మొబైల్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ Pradeo పరిశోధకుల బృందం తాజాగా గుర్తించింది. భద్రతా సంస్థ జోకర్ మాల్వేర్‌ను ఫ్లీస్‌వేర్‌గా వర్గీకరిస్తుంది. కొత్త ఎమోజీలతో ఎస్‌ఎమ్‌ఎస్ సందేశాలను మరింత ఆహ్లాదకరంగా మార్చే ఈ యాప్.. అన్‌వాంటెడ్ పెయిడ్ ప్రీమియం సర్వీసెస్‌‌ను సబ్‌స్ర్కైబ్ చేసేందుకు తెలియకుండానే యూజర్స్‌ను అనుమతిస్తుంది. అంతేకాదు మన మొబైల్స్‌లోని SMSని క్యాప్చర్ చేయడం దీని ప్రాథమిక విధి. డిసెంబర్ 16 వరకు Google Play స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ కలర్ మెసేజ్ యాప్‌ను Google Play Store నుంచి ఇటీవలే తొలగించారు. అయితే, యాప్‌ని గతంలో డౌన్‌లోడ్ చేసుకున్న వినియోగదారులకు ఇప్పటికీ భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.

ఏం చేయాలి?

కలర్ మెసేజ్ యాప్ మీ మొబైల్‌లో ఉంటే.. వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. అందుకోసం గూగుల్ ప్లే స్టోర్‌ని ఓపెన్ చేసి, ఆపై మెనూలో My Apps & Games ఎంపికను పొందుతారు. కలర్ మెసేజ్ యాప్‌ని ఎంచుకుని, అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. అయితే ఈ మాల్వేర్ కారణంగా సైన్ అప్ చేసిన సబ్‌స్క్రిప్షన్స్ రద్దు చేసేందుకు ప్లేస్టోర్‌లోనే సైన్ అప్ చేసిన అన్ని ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లను చెక్ చేయండి. వాటిలో ఏవైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, దాన్ని ఎంచుకుని, ఆపై సభ్యత్వాన్ని రద్దు చేయాలి.

Advertisement

Next Story

Most Viewed