కుటుంబ సభ్యుల ముందే కడియం శ్రీహరికి చేదు అనుభవం.. ఏం జరిగిదంటే?

by Aamani |   ( Updated:2021-10-12 01:58:32.0  )
కుటుంబ సభ్యుల ముందే కడియం శ్రీహరికి చేదు అనుభవం.. ఏం జరిగిదంటే?
X

దిశ,బాసర : నిర్మల్ జిల్లా బాసర‌లో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి‌కి చేదు అనుభవం. దసరా నవరాత్రుల్లో భాగంగా మంగళవారం మూల నక్షత్రం సందర్భంగా బాసర సరస్వతి ఆలయానికి కడియం కుటుంబ సమేతంగా విచ్చేశారు. ఈ క్రమంలో శ్రీహరిని ఆలయ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే, ఆలయానికి ఎవరైనా నాయకులు, ఉన్నతాధికారులు వస్తే ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు. కానీ, తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి అయిన కడియం శ్రీహరి‌కి ఎలాంటి మర్యాదలు చేయలేదు. మూల నక్షత్రం సందర్భంగా ఆయన మనుమరాలు ఆర్వి‌కి అక్షరాభ్యాసం కోసం కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయన అక్షరాభ్యాస మండపంలో సాధారణ భక్తుడిలా 30 నిమిషాలు నిలబడి ఉన్నారు. అలా నిలబడి ఉన్న ఆయనను చూసిన భక్తులు పదవి‌లో ఉన్నపుడే ఎవరైనా పట్టించుకుంటారని పదవి‌లో లేకుంటే ఎవరు పట్టించుకోరని మాట్లాడుకున్నారు.

Advertisement

Next Story