- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుల సంఘాల అల్టిమేటం.. దేశవ్యాప్తంగా రోడ్లు బ్లాక్!
దిశ, వెబ్‌డెస్క్ : గణతంత్ర వేడుకల్లో తలెత్తిన విధ్వంసం తర్వాత వెనక్కితగ్గిన రైతు సంఘాల నాయకులు, రైతులు మళ్లీ కదం తొక్కారు. సాగు చట్టాలను రద్దు చేసేంత వరకు తమ నిరసనను వదిలేది లేదని ఢిల్లీ సరిహద్దుల వెంబడి సోమవారం భారీ ఎత్తున ఆందోళనను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి-6వ తేదీ (శనివారం) దేశవ్యాప్తంగా రోడ్లను నిర్భంధిస్తామని భారతీయ కిసాన్ యూనియన్(BKU) అధ్యక్షులు బల్బీర్ సింగ్ రాజేవాల్ స్పష్టం చేశారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి 3వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వెల్లడించారు. ఇదిలాఉండగా, రైతులతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, తాము సాగు చట్టాలను రద్దు చేసేంతవరకు వెనక్కి తగ్గబోమని రైతుసంఘాల నాయకులు తెగేసి చెబుతున్నారు. దేశరాజధాని సరిహద్దుల్లో ఇప్పటికీ వీరు చేపట్టిన ఆందోళన రెండు నెలలుగా సాగుతోంది.