మధ్యంతర ఎన్నికలు వస్తాయి: బండి సంజయ్

by Anukaran |
మధ్యంతర ఎన్నికలు వస్తాయి: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మాట్లాడిన ఆయన ఎన్నికలు ముగియగానే టీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వం కూలిపోతుందని జోష్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అన్ని లెక్కలు చెబుతోందని హెచ్చరించారు. అమిత్ షా నగరానికి వస్తున్నారని గుర్తుచేసిన బండి సంజయ్.. టీఆర్ఎస్ ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. పీఎంవో నుంచి సీఎం కేసీఆర్‌కు అనుమతి లేదన్న ఉత్తర్వులు వచ్చాక.. భారత్‌ బయోటెక్‌కు సీఎం కేసీఆర్ ఎందుకు రావొద్దన్నారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేయడం గమనార్హం. ప్రముఖుల ఘాట్ల జోలికి వస్తే దారుస్సలాంను కూల్చేస్తామని బండి సంజయ్ మరోసారి తేల్చి చెప్పారు. ఇంట్లో చెప్పే వచ్చాను.. చావుకు భయపడేది లేదని బండి సంజయ్ చెప్పారు.

Advertisement

Next Story