నిన్ను నువ్వే కాల్చుకున్నావ్.. ఇర్ఫాన్‌ను తలుచుకుని భావోద్వేగానికి లోనైన కొడుకు.. 

by Shyam |
irfan son babli
X

దిశ, సినిమా: బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ తన తండ్రిని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యాడు. తండ్రి ఇర్ఫాన్ భుజంపై తల్లి తలవాల్చిన సెల్ఫీ పోస్ట్ చేసిన ఆయన.. భావోద్వేగపూరిత మైన కవితను పంచుకున్నారు. ‘ఇటీవల కురిసిన వర్షానికి మట్టి వాసనలో నా కలలు కదలాడుతున్నాయి. మీరు మిగిల్చిన గాయాలను అలాగే దాచాను. కానీ ఆ గాయాల మరకలు మానిపోతే నేను అబద్ధం చెప్పానంటారని భయపడుతున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు నటించడం నేర్చుకున్నాను. మీ చేతి వేళ్ల మధ్య సిగరెట్ బూడిదతో వేసే పెయింటింగ్ జ్ఞాపకం అలాగే మిగిలిపోయింది. నీ నిప్పు నీవే వెలిగించుకున్నావు. నిన్ను నీవే కాల్చుకున్నావు. కానీ మీ బూడిద ఈ నేలను శుభ్రం చేసింది. ఇప్పుడు ఈ గాలిలో సందడి చేస్తుంది’ అని రాసుకొచ్చాడు. ఇక బాబిల్ తండ్రి బాటలోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగా.. త్వరలో అనుష్క శర్మ నిర్మిస్తున్న ‘ఖాలా’లో కనిపించనున్నాడు. కాగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

Advertisement

Next Story