అయోధ్యలో అద్భుతం.. బాలరాముడిని చూడటానికి రెండు కళ్లుచాలవు!

by Jakkula Samataha |   ( Updated:2024-04-17 08:05:46.0  )
అయోధ్యలో అద్భుతం.. బాలరాముడిని చూడటానికి రెండు కళ్లుచాలవు!
X

దిశ, ఫీచర్స్ : అయోధ్యలో అద్భుత దృశ్యం అందరినీ ఆకర్షించింది. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో బాలరామయ్యకు పూజలు చేశారు పండితులు. కాగా, ఈరోజు అయోధ్యలో ఓ అద్భుతం కనులవిందు చేసింది. 51 అంగుళాల పొడవుతో ఉన్న 5 ఏళ్ల బాల రాముడి విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకాయి. బాలరాముని నుదిటిపై తిలకంలా సూర్య కిరణాలు పడ్డాయి. సుమారు ఆరు నిమిషాల పాటు, సూర్య భగవానుడు ఆ బాలరామయ్యను ముద్దాడాడు. దీంతో రాముని విగ్రహం నీలం రంగులోకి మారి అందరినీ ఆకట్టుకుంది. దీంతో అక్కడి భక్తులందరూ జై శ్రీరామ్ నినాదాలతో ఆ రామయ్యను తలుచుకున్నారు.

దీన్నే సూర్యాభిషేక లేదా సూర్య తిలకం అంటారు. ప్రతి ఏటా శ్రీరామ నవమి రోజున మాత్రమే ఈ అద్బుత దృశ్యం భక్తులను కనువిందు చేయనుంది. ఆ రామయ్య చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజున మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారని ప్రజలందరూ నమ్ముతారు. అందువలన ప్రతి శ్రీరామనవమి రోజున అయోధ్యలో టెక్నాలజిని ఉపయోగించి సూర్య కిరణాలు రాముడి నుదిటిపై వెలిగేలా సిద్ధం చేయనున్నారంట. ప్రస్తుతం ఈ ఘట్టం కోట్లాది హిందూ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇక అయోధ్యలో బాలరామయ్య కొలవుదీరిన తర్వాత వచ్చిన మొదటి శ్రీరామనవమి ఇది. ఈరోజున అయోధ్యలో పండితులు ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story