- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీ సెషన్స్.. అక్టోబరు 1తో ఆఖరు?
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అక్టోబరు 1వ తేదీన ముగిసే అవకాశాలున్నాయి. ‘గులాబ్’ తుపాను కారణంగా అసెంబ్లీ సెషన్ ఈ నెల 30వ తేదీ వరకు వాయిదా పడింది. తిరిగి అక్టోబర్ 1వ తేదీన ప్రారంభం కానున్నది. అదే రోజున నాలుగు బిల్లులకు ఆమోదం పొందిన తర్వాత నిరవధికంగా వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సమావేశాలను కొనసాగించడంపై అసెంబ్లీ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక షెడ్యూలు విడుదల కావడంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఈ తరహా రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. తొలుత బీఏసీలో జరిగిన చర్చల ప్రకారం అక్టోబరు 5వ తేదీ వరకు సమావేశాలు కొనసాగాల్సి ఉంది. కానీ అప్పటివరకూ కంటిన్యూ కాకపోవచ్చనే బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక అన్ని పార్టీలకూ కీలకంగా మారడంతో సెషన్‌ను వీలైనంత తొందరగా కుదించడం ద్వారా ప్రచారంలో పాల్గొనవచ్చనే అభిప్రాయంతో ఉన్నాయి. మొత్తం సెషన్‌కు ఏడు పనిదినాలుగా నిర్ణయం జరిగినా.. ఒక్క రోజు మాత్రమే జరిగింది. సమావేశాలు 24వ తేదీ ప్రారంభమైనా సంతాప తీర్మానాలతోనే ఆ రోజు సరిపోయింది. కేవలం సెప్టెంబరు 27న మాత్రమే ఉభయ సభలు జరిగాయి. ఆ తర్వాత వరుసగా మూడు రోజులు తుపాను కారణంగా వాయిదా పడ్డాయి. ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన తెలంగాణ హౌజింగ్ బోర్డు సవరణ బిల్లు -2021, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టీకల్చర్ యూనివర్సిటీ సవరణ బిల్లు -2021, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లు-2021, నల్సార్ యూనివర్సిటీ బిల్లు-2021లకు ఆమోదం లభించాల్సి ఉంది.
అక్టోబరు 1వ తేదీన ఈ బిల్లులపై నామమాత్రపు చర్చలు జరిపి నిరవధికంగా వాయిదా వేయడమే ఉత్తమం అనే అభిప్రాయం అన్ని పార్టీల నుంచి వ్యక్తమవుతుంది. దీంతో స్పీకర్, మండలి ప్రొటెం ఛైర్మన్ ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు ముగిస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులంతా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వెసులుబాటు లభిస్తుంది. సమావేశాలను కొనసాగిస్తారా? లేకుంటే కుదించి తొందరగా ముగిస్తారా? అనేది అక్టోబరు 1న తేలనుంది.
- Tags
- assembly