షెడ్యూల్ ఖరారు.. అక్టోబర్ 5 వరకు అసెంబ్లీ

by Shyam |
Assembly
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలుత అక్టోబర్ 1 వరకు నిర్వహించాలని భావించినప్పటికీ.. సభ్యులు పొడిగించాలని కోరారు. దీంతో అక్టోబర్ 5 వరకు సమావేశాలు నిర్వహించేందుకు సంబంధించిన షెడ్యూల్ ను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. తొలి సెషన్ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. మృతి చెందిన మాజీ శాసనసభ్యులకు సంతాప తీర్మానాన్ని స్పీకర్ ప్రవేశపెట్టారు. సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించిన తర్వాత సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సభ ప్రారంభమైన అరగంట వ్యవధిలోనే తొలి సెషన్ ముగిసింది. అదే విధంగా మండలి సమావేశం మండలి ప్రొటెం చైర్మన్ ఎన్నవరం భూపాల్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది. మృతి చెందిన మాజీ ఎమ్మెల్సీలకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. మౌనం పాటించారు. మండలి సైతం ప్రారంభమైన అరగంటకే సోమవారానికి వాయిదా పడింది. సమావేశాల్లో శాసనసభ, మండలి సభ్యులందరూ పాల్గొన్నారు.

సభ వారం రోజులే…

శుక్రవారం నుంచి ప్రారంభమైన సభ అక్టోబర్ 5 వరకు జరగనుంది. అయితే వాయిదాతో శనివారం జరగదు. ఆదివారం హాలిడే. తిరిగి ఈ నెల 27 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగుతుంది. 2న గాంధీ జయంతి, 3న సండే కావడంతో జరగదు. 4,5 తేదీల్లో మాత్రమే జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed