ఈ నెల 7 వరకు అసెంబ్లీ సమావేశాలు!

by Shyam |
ts-assembly
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల మూడో రోజు శుక్రవారం అసెంబ్లీలో నాలుగు బిల్లులు ఆమోదం పొందాయి. తెలంగాణ గృహ నిర్మాణ మండలి(సవరణ)-2021 బిల్లును రోడ్లు భవనాలు,శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టగా.. సభలో స్వల్పకాలిక చర్చ నిర్వహించిన అనంతరం అధికారపక్షంతో పాటు ప్రతిపక్షాల సభ్యులు ఆమోదం తెలిపారు. బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అదే విధంగా కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ(సవరణ)బిల్లు-2021ను ఆమోదించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జాతీయ న్యాయశాస్త్ర అధ్యయనాల, పరిశోధనల అకాడమీ విశ్వవిద్యాలయ బిల్లు-2021 ను దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లు-2021ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆమోదించాల్సిందిగా సభను కోరారు.

బిల్లులకు అన్ని పార్టీలు మద్దతు తెలుపడంతో ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. తెలంగాణ వస్తువుల, సేవల పన్ను బిల్లును సీఎం కేసీఆర్ సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి కోసం ప్రతిపాదించారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటకులపై, ప్రయాణికులపై దళారీతనం, దుష్ప్రవర్తను నివారించే బిల్లును ప్రవేశపెట్టేందుకు హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అనుమతి కోసం ప్రతిపాదించారు. ఈ రెండు బిల్లులపై సోమవారం జరిగే సమావేశంలో చర్చించనున్నారు. బిల్లులు ఆమోదం పొందగానే స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

7వరకు అసెంబ్లీ సమావేశాలు!

8వ తెలంగాణ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 5వరకు నిర్వహించాలని తీర్మానం చేశారు. అయితే వర్షాల నేపథ్యంలో సెప్టెంబర్ 28,29,30 తేదీల్లో అసెంబ్లీని తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే ఇందులో రెండు ఆదివారాలు, రెండు శనివారాలు రావడం, భారీ వర్షాలతో మూడ్రోజులు వాయిదా వేయడంతో సభ వారం రోజులు నడుస్తుంది. అయితే పలు అంశాలపై చర్చించాలని భావించి మరో రెండు రోజులు(ఈ నెల 7వరకు పొడిగించాలని) నడపాలని భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed