- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వారిపై ప్రభుత్వం… పనిభారం పెంచింది

X
దిశ,మధిర: ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వకుండా, ప్రభుత్వం పనిభారాన్ని పెంచిందని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట పీహెచ్‌సీలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారావు మాట్లాడుతూ…
సీఎం కేసీఆర్ ఆశా వర్కర్లకు రూ.10వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చి, నేడు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కరోనా నేపథ్యంలో ఆరు నెలల నుంచి ముందు లైన్‌లో ఉండి పని చేస్తున్న ఆశా వర్కర్లకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా కార్యకర్తలు సంఘటితంగా పోరాడి సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.
Next Story