- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమాలు ఆడకుంటే లావు పెరిగా : హీరో
దిశ, సినిమా : ‘ఇషక్‌జాదే’ మూవీతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అర్జున్ కపూర్.. ప్రొఫెషనల్ లైఫ్‌లో చెప్పుకోదగ్గ సినిమాలే చేశాడు. కాగా గతంలో వెయిట్ రిలేటెడ్ ఇష్యూస్‌తో బాధపడ్డ ఈ స్టార్ కిడ్.. ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డాడో రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తన సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఎలా ఫీల్ అయ్యాడో గుర్తుచేసుకున్న అర్జున్.. చాలా కాలం నుంచి ఒబెసిటీతో పోరాడుతున్నానని, హెల్త్ కండిషన్ కారణంగానే లావయ్యానని చెప్పాడు. ఇక కొంతమంది ఆడియన్స్ చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ వారిని అర్థం చేసుకుంటానన్న అర్జున్.. యాక్టర్స్ పర్ఫెక్ట్ లుక్‌లో ఉండాలని వారు కోరుకోవడంలో తప్పు లేదన్నాడు.
ఇక కెరీర్ ఒడిదొడుకుల గురించి మాట్లాడుతూ.. ‘షేమింగ్ అనేది డైలీ లైఫ్‌లో భాగమైపోయింది. నా సినిమాలు బాగా ఆడనప్పుడు నెగెటివిటీ పెరిగిపోయేది. అవి ఆరోగ్య సమస్యలు తలెత్తేందుకు కారణమయ్యేవి. అయితే నిరంతరం పనిలో నిమగ్నమై ఉండటంతో ఆ ఎఫెక్ట్ నుంచి బయటపడొచ్చు’ అని తెలిపాడు. చివరగా ‘సర్దార్ కా గ్రాండ్‌సన్’తో పాటు ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ చిత్రాల్లో కనిపించిన అర్జున్.. ప్రస్తుతం ‘ఏక్ విలన్2’తో పాటు ‘భూత్ పోలీస్’ చిత్రాల్లో నటిస్తున్నాడు.