- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యథేచ్ఛగా తిరుగుతున్న పాజిటివ్ పేషెంట్లు
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ విజృంభిస్తోంది. వందల నుంచి కేసులు వేలకు చేరడంతో జనం బెంబేలెత్తున్నారు. అయితే ప్రభుత్వం మొదట్లో తీసుకున్న చర్యలిప్పుడేవీ కనిపించడం లేదు. కరోనాతో సహజీవనం అంటూ నేతలు చేసిన ప్రకటనల నేపథ్యంలో ప్రజల స్వీయ రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. పాజిటివ్ సోకిన, అనుమానిత వ్యక్తులెవరో.. ఎక్కడెక్కడున్నారో అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. సమాజం తమను ఎక్కడ వెలి వేస్తుందోనని రోగులు కూడా విషయాన్నిగోప్యంగా ఉంచుతున్నారు. ప్రధానంగా నగరాల్లోనే ఈ దాపరికం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతి రోజూ వందల్లో రికార్డుల్లో కనిపిస్తున్న పేషెంట్లు ఎక్కడ చికిత్స పొందుతున్నారన్న సందేహం కలుగుతోంది. క్వారంటైన్‌లో ఉన్న ఇండ్లను గుర్తించడం కష్టంగా మారింది. ఇక కొందరు రోగులైతే రాంగ్ నంబర్ ఇస్తూ వారు ఉంటున్న ప్రాంతాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. కరోనా వైరస్ తొలి రోజుల్లో ఒక్కరికి పాజిటివ్ అని తేలితే.. ఆ కాలనీ, బస్తీని పూర్తిగా బంద్ చేసేవాళ్లు. పక్కవాళ్లను అటువైపు వెళ్లకుండా నియంత్రించేవాళ్లు. ఆ తర్వాత క్వారంటైన్ ఇల్లు అంటూ బోర్డులు పెట్టేవారు. ఇప్పుడు అలాంటి చర్యలేవీ కనిపించడం లేదు. దాంతో పక్క పోర్షన్‌లో పాజిటివ్ సోకిన వాళ్లు ఉన్నా గుర్తించలేని దుస్థితి నెలకొందన్న ఆందోళన నెలకొంది. దాంతో ఎవరిని ఎలా చూడాలో తెలియక బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు దూరమవుతున్నాయి.
వద్దు.. చెప్పొద్దు
మీర్‌పేట కార్పొరేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఏప్రిల్‌లో అనుమానితుడిగా కనిపించాడు. దాంతో ఆయన ఇంటికే బోర్డు పెట్టి క్వారంటైన్ ఇల్లు.. 14 రోజుల పాటు ఇటు వైపు రావద్దంటూ సూచించారు. దాంతో ఆ కాలనీ పూర్తిగా ఆ ఇంటి వైపు ఎవరూ తిరిగి చూడలేదు. అదే వ్యక్తికి జూలైలో కరోనా పాజిటివ్‌గా తేలింది. తీవ్రమైన లక్షణాలతో బాధ పడుతున్నాడు. అయినా ఇంట్లోనే ఉండాలని వైద్యులు సూచించారు. ప్రతి రోజూ తను ఇబ్బంది పడుతున్నానంటూ అధికారులకు, పోలీసులకు ఫోన్లు చేశాడు. కానీ, పాజిటివ్ వచ్చిందన్న విషయాన్ని పక్కింటోళ్లకు చెప్పొద్దు.. వాళ్లు ఇబ్బంది పెడతారు.. అసలే ఆసుపత్రిలో పరిస్థితి బాగా లేదంటూ ఉచిత సలహా ఇచ్చారు. దాంతో 10 రోజులుగా వాళ్లు చెప్పిన మందులను వాడుతూ ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే ఇంటికి మాత్రం ఎవరూ రాలేదు. కనీసం వైద్యారోగ్య సిబ్బంది కూడా రాలేదు. ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్న ఇంటికి ఎలాంటి బోర్డు పెట్టలేదు.
నిబంధనల ఉల్లంఘన
హిమాయత్ నగర్ రోడ్డు నం.15లోని ఓ అపార్టుమెంటులోని ఒక ఫ్లాట్‌లో ముగ్గురు కొవిడ్ వ్యాధిగ్రస్థులు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా విద్యావంతులే. పైగా సంపన్న వర్గాలు. అయితే వారికి పాజిటివ్ అన్న విషయం మాత్రం ఆ అపార్టుమెంటు వాళ్లందరికీ తెలిసింది. గురువారం రాత్రి వాళ్లు ముగ్గురు బయట తిరిగారు. దాంతో హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి బాధ్యతారహితంగా ఎక్కడ పడితే అక్కడ ఉమ్ముతున్నారని, వేసుకున్న దుస్తులు, చెప్పులు పడేస్తున్నారు. వేరే వారికి వ్యాధి సోకేలా వింతగా ప్రవర్తిస్తున్నారంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యారోగ్య శాఖ అధికారులు, మునిసిపల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారి మాటలు కూడా ధిక్కరించి.. పక్క వారికి అంటించే ప్రయత్నం చేస్తున్నారంటూ అపార్టుమెంట్ వాసులు ఆందోళన చెందుతున్నారు. దాంతో అధికారులు, పోలీసులంతా ఆ ఇంటికి వెళ్లారు. పాజిటివ్ అనుమానితులేమో తమ క్వారంటైన్ కాలం పూర్తయి పోయిందంటూ వాదించారు. ఈ మేరకు వాళ్ల మెడికల్ రిపోర్టులు చూపించారు. అదే వారింటికి క్వారంటైన్ బోర్డు పెట్టి, దానిపై నిర్దేశిత కాలాన్ని పేర్కొంటే వాళ్ల మధ్య గొడవలకు ఆస్కారం ఉండకపోయేదన్న అభిప్రాయం నెలకొంది.
దాచడం కంటే.. అప్రమత్తతే మేలు
కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తులు నివాసముండే ఇండ్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచడం కంటే అప్రమత్తం చేయడం ద్వారానే ప్రయోజనం కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాళ్ల ఇండ్లకు స్టిక్కర్లు అంటించడం వల్ల క్వారంటైన్ కాలపరిమితిని ఇరుగుపొరుగు అర్ధం చేసుకునే వీలుంది. ప్రస్తుతం కరోనా వైరస్ పట్ల అవగాహన పెరిగింది. చాలా ప్రాంతాల్లో, అపార్టుమెంట్లలో క్వారంటైన్ లోని వ్యక్తులకు సదుపాయాలను కల్పిస్తున్నారు. కొందరైతే ఆహార పదార్థాలను కూడా సప్లయ్ చేస్తున్నారు. పాజిటివ్ రోగుల పట్ల మానవీయ కోణంలోనే చూడాలన్న ప్రచారమే మేలు కలిగిస్తోందని మహేశ్వరంకు చెందిన రాకేష్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలు అభిప్రాయపడ్డారు. తాము పాజిటివ్‌తో చికిత్స పొందుతూ చనిపోయిన ముగ్గురి అంత్యక్రియలకు హాజరయ్యాం.. కాస్త జాగ్రత్తలు తీసుకున్నాం. మాకు ఎలాంటి లక్షణాలు లేవు. ఎలాంటి ఇబ్బంది కలగలేదని స్పష్టం చేశారు. నెల రోజుల పాటు వాళ్లకు చికిత్స అందిస్తోన్న ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగాం. వైద్యులతో మాట్లాడాం.. సిబ్బందితో రోజూ మాట్లాడి క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూనే ఉన్నాం. పాజిటివ్ సోకిన వాళ్లు మన వాళ్లే కదా.. అలాంటప్పుడు మనుషులను ఎందుకు దూరం చేసుకోవాలి? కాకపోతే భౌతికంగా దూరం ఉంచాలన్నారు. అధికారులు కూడా పాజిటివ్ సోకిన వారితో ఎలా మెలగాలో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.