- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీటీడీ పాలకమండలి బడ్జెట్‌కు ఆమోదం
టీటీడీ పాలక మండలి బడ్జెట్ ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో 2020-21 సంవత్సరానికి రూ. 3,309 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను కేటాయించారు. కాగా, గతేడాది కంటే ఈసారి రూ. 60 కోట్లు బడ్జెజ్ అంచనా పెరిగింది. హుండీ ద్వారా రూ. 1,351 కోట్లు, వడ్డీల ద్వారా రూ. 706 కోట్ల ఆదాయం వస్తుందని సభ్యులు అంచనా వేశారు. లడ్డు విక్రయాల ద్వారా రూ. 400 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా 2020-21 శార్వారి నామా సంవత్సర పంచాంగాన్ని టీటీడీ ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, ఈవో సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డిలు విడుదల చేశారు.
టీటీడీ పాలకమండలి నిర్ణయాలు:
రూ. 18 కోట్లతో అన్ని క్వార్టర్స్ ఆధునీకరణ
టీటీడీ విజిలెన్స్ విభాగంలో సెక్యూరిటీ గార్డుల నియామకం
టీటీడీ పరిధిలోని ఆలయాల్లో 1500 సీసీ కెమెరాల ఏర్పాటు
బూందిపోటులో అగ్నిప్రమాదాల నివారణకు రూ. 3.3 కోట్లతో థర్మోఫ్లూయిడ్స్ స్టౌవ్‌ల ఏర్పాటు
జూపార్క్ వద్ద ప్రతిభావంతుల భవన నిర్మాణానికి ఆమోదం
బర్డ్ ఆస్పత్రి అభివృద్ధికి రూ. 8.5 కోట్లు
ఎస్వీ భజన పాఠశాల నిర్మాణానికి రూ. 34 కోట్లు
అలిపిరి-చెర్లోపల్లి రోడ్డు విస్తరణకు రూ. 16 కోట్లు కేటాయింపు
అలిపిరి టోల్ గేటు వద్ద రుసుం పెంచుతూ నిర్ణయం
రూ. 3.92 కోట్లతో చెన్నైలో అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఆమోదం
జమ్ము కశ్మీర్, వారణాసి, ముంబైలో ఆలయ నిర్మాణానికి ఆమోదం
జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ అభివృద్ధి పనులకు ఆమోదం
సైబర్ వింగ్ ప్రారంభించాలని టీటీడీ నిర్ణయం