జులై 10 నుంచి పదోతరగతి పరీక్షలు

by srinivas |
జులై 10 నుంచి పదోతరగతి పరీక్షలు
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడిన పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను గురువారం ఎస్ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. జులై 10 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. గతంలో మాదిరిగా 11 పేపర్లు కాకుండా ఈసారి 6 పేపర్లకే పరీక్షలను పరిమితం చేసినట్లు పేర్కొంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షా సమయంగా ఎస్‌ఎస్‌బోర్డు నిర్ణయించింది. జులై 10న ఫస్ట్ లాంగ్వేజ్, 11న సెకండ్ లాంగ్వేజ్, 12 థర్డ్ లాంగ్వేజ్, 13న మ్యాథ్స్, 14న సైన్స్, 15న సోషల్ పరీక్ష ఉంటుంది.

Next Story

Most Viewed