- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు
దిశ, అమరావతి: ప్రభుత్వ పాలసీలలో కోర్టుల జోక్యం దారుణమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. గురువారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అయన మీడియాతో మాట్లాడారు. ఇది ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబడడమేనని ఆక్షేపించారు. ఇలానే కొనసాగితే ఇక ఎన్నికలు, ఎమ్మెల్యేలు కావడం ఎందుకని ప్రశ్నించారు. కోర్టులే అభివృద్ధి పనులు ఆపమని అంటుంటే…ఇక ఈ వ్యవస్థలు ఎందుకని,న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని నడిపిస్తాయా? అని ప్రశ్నించారు. బాధతోనే కోర్టు తీర్పులు అంగీకరిస్తున్నామని అన్నారు. మేధావులు దీనిపై చర్చించాలని పేర్కొన్నారు. తమ నిర్ణయాలు తప్పైతే గెలిపించిన ప్రజలే మళ్లీ ఓడిస్తారని అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించి ముందుకు వెళుతున్నామని చెప్పారు. మనీ బిల్లును ఆపడం రాజకీయాల్లో వికృత చేష్టలకు పరాకాష్టని, దీంతో ఉద్యోగుల జీతాలు ఆగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి దుస్థితి ఎన్నడూ చూడలేదన్నారు.