ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల

by srinivas |   ( Updated:2021-10-21 07:19:26.0  )
ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఏపీ పీజీఈసెట్ పరీక్షా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి ఈ ఫలితాలను విడుదల చేసింది. పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ రిజల్ట్స్‌ను, ర్యాంక్ కార్డును అధికారిక వెబ్‌సైట్ sche.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి తెలిపింది. సెప్టెంబర్ 27 నుంచి 29, అక్టోబర్ 8న జరిగిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలు మాత్రమే విడుదలయ్యాయని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. ప్రిలిమినరీలో లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసి మరలా ఈ ఫలితాలను విడుదల చేసినట్లు ప్రకటించింది.

ఏపీ ఉన్నత విద్యా మండలి తరపున శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించింది. దీనికి సంబంధించిన ప్రాథమిక జవాబు కీ ని అక్టోబర్ 2న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు త్వరలోనే కౌన్సెలింగ్‌ జరిగే అవకాశం ఉంది. ఏపీలోని వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలకు ఇదే చివరి దశ ప్రక్రియ కానుంది.

Advertisement

Next Story