లాక్ డౌన్ ఎఫెక్ట్ : రోజుకు వెయ్యి వాహనాలు..

by Shyam |
లాక్ డౌన్ ఎఫెక్ట్ : రోజుకు వెయ్యి వాహనాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. దీంతో నగరంలో మళ్ళీ లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు నిన్న ఒక్క రోజే కేసుల సంఖ్య 2వేల సమీపానికి చేరడంతో ప్రజలు సైతం ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియని భయాందోళనకు గురవుతున్నారు.ఈ నేపథ్యంలోనే బతికుంటే బలుసాకు తినొచ్చనే సీఎం కేసీఆర్ సామెత గుర్తుకు వచ్చిందేమో..చాలా మంది నగరం విడిచి ఇంటిబాట పడుతున్నారు. హైదరాబాద్ లో ఉండే ఏపీ వాసులైతే రోజుకు వెయ్యి మంది దాకా ఇంటిబాట పడుతున్నారని సమాచారం. అయితే, సరిగ్గా ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. రాష్ట్రంలోకి ఎవరు రావాలనుకున్నా ఈ పాస్ కచ్చితంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దాంతో ఈపాస్ ఉన్నవారు మాత్రమే ఏపీలో అడుగు పెడుతున్నారు. గతంలో ప్రతిరోజూ హైదరాబాద్ నుంచి ఏపీకి సుమారుగా 300 నుండి 400 వాహనాలు వెళితే ఇపుడు రోజుకు 800 నుంచి 1000 వరకు వెళుతున్నాయి. వీటితో పాటు మరో 500 వాహనాలు కూడా ఈ పాస్ లేకుండా తెలంగాణ సరిహద్దులు దాటుతున్నాయి.కాగా,ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు పాసులు లేని వారిని చెక్ పోస్టుల నుంచే తిరిగి వెనక్కి పంపిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story