మంత్రి హరీశ్‌రావుపై ఏపీ మంత్రి బాలినేని ఫైర్

by srinivas |   ( Updated:2020-09-25 07:44:54.0  )
మంత్రి హరీశ్‌రావుపై ఏపీ మంత్రి బాలినేని ఫైర్
X

దిశ, ఏపీ బ్యూరో: తెలంగాణ మంత్రి హరీశ్‌రావుపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. బోర్లకు మీటర్ల అమర్చే విషయంలో ఏపీ ప్రభుత్వంపై మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కేంద్రం ఇచ్చే రూ.4వేల కోట్లు మేం జేబుల్లో వేసుకోమని ప్రజల కోసమే ఖర్చు పెడతామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలా కేంద్రంతో ఒకరోజు మంచిగా మరో రోజు గొడవ పడటం కాకుండా రాష్ట్రాభివృద్ధి కోసం దీర్ఘకాలిక సఖ్యత అవసరమని భావించినందువల్లే కేంద్రానికి మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. మరో 30ఏళ్లు రైతులకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో మాట తప్పే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story