స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వు

by srinivas |
స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ వేసిన వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మంగళవారం ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఉద్యోగుల తరపున దాఖలైన అనుబంధ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఎస్ఈసీ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ఎస్ఈసీ తరపు న్యాయవాది నిన్న వాదనలు వినిపించారు. కాగా, కరోనా వ్యాక్సిన్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాలను ఎస్ఈసీ పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వినిపించారు. ఏజీ వాదనలకు ఎస్ఈసీ తరపు న్యాయవాది బదులిచ్చేందుకు విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. ఇవాళ ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed