- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కేసులో భర్త గర్ల్‌ఫ్రెండ్‌ను విచారించలేము : ఏపీ హైకోర్టు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, ఏపీ బ్యూరో : మహిళల వరకట్న మరణాలు.. మహిళలపై వేధింపులను అడ్డుకునేందుకు 1983లో ఐపీసీ సెక్షన్ 498(ఏ) ప్రకారం వరకట్న వేధింపుల వ్యతిరేకత చట్టాన్ని తీసుకొచ్చారు. వరకట్న వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు ఈ చట్టం ఒక అస్త్రంగా మారింది. ఈ చట్టం కింద ఫిర్యాదు చేస్తే నిందితులను పోలీసులు వెంటనే అరెస్టు చేస్తారు. అంతటి పవర్ ఫుల్ చట్టాన్ని ఒక్కోసారి కొందరు మహిళలు దుర్వినియోగపరుస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. తాజాగా ఈ 498(ఏ) సెక్షన్‌పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
గర్ల్ ఫ్రెండ్‌ను ఈ సెక్షన్ కింద విచారించటానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. భర్త సంబంధీకుల్లో గర్ల్‌ఫ్రెండ్ రాదని పేర్కొంది. అందువల్ల గర్ల్‌ఫ్రెండ్‌ను 498ఏ సెక్షన్ కింద విచారించటానికి వీల్లేదని తెలిపింది. ఒక వ్యక్తి గర్ల్‌ఫ్రెండ్‌పై పోలీసులు నమోదు చేసిన 498ఏ సెక్షన్ కింద విచారించలేమని తేల్చి చెప్పింది. అంతేకాదు పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
రెస్టుతో సహా మరెలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే మిగిలిన నిందితులపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. ఓ మహిళ తన భర్త, తన భర్త గర్ల్‌ఫ్రెండ్‌పై దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సందర్భంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లాకు చెందిన దంపతుల మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భార్య.. భర్తతోపాటు అతడి కుటుంబ సభ్యులు, గర్ల్ ఫ్రెండ్‌పై నెల్లూరు దిశ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తకు గర్ల్ ఫ్రెండ్‌గా ఉన్న యువతి కూడా తనను వేధింపులకు గురి చేస్తున్నట్లుగా భార్య ఫిర్యాదులో పేర్కొంది. దీంతో, దిశ మహిళా పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేసి ఏ2గా చేర్చారు.
దీంతో ఆ యువతి దిశ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫిర్యాదు చేసిన మహిళ ఆమె భర్తకు ఉన్న వివాదాల్లో తన క్లయింట్‌ను ఇరికించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఫిర్యాదురాలు పేర్కొన్నట్లు వేధింపులతో తన క్లయింట్‌కు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. సెక్షన్ 498ఏ ప్రకారం భర్త.. అతడి బంధువుల మీద మాత్రమే వేధింపుల కేసు పెట్టొచ్చని అంతేకానీ ఫిర్యాదుదారుతో ఏ మాత్రం సంబంధం లేని భర్త గర్ల్‌ఫ్రెండ్ మీద కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన న్యాయస్థానం భర్త గర్ల్ ఫ్రెండ్ పై పోలీసులు పెట్టిన కేసు చెల్లదంటూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. 498ఏ కింద రక్త సంబంధం ఉన్న వారు లేదంటే వివాహం ద్వారా భర్తకు బంధువులైన వారిని మాత్రమే విచారించే వీలుందని పేర్కొన్నారు. తదుపరి విచారణను కోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.