ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

by srinivas |   ( Updated:2021-03-09 09:14:07.0  )
ap highcourt
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు నిర్వహించొద్దన్న సింగిల్ బెంచ్ ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫలితాలు మాత్రం వెల్లడించొద్దని సూచించింది. తదుపరి విచారణను మార్చి 23కి హైకోర్టు వాయిదా వేసింది. ఇకపోతే ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని హైకోర్టులో పలువురు పిల్ వేశారు. దీంతో ఓటర్ల జాబితాకు సంబంధించి దాఖలైన పిల్ పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. విచారణ అనంతరం ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. తాజాగా మంగళవారం జరిపిన విచారణలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed