ఇదే.. ఏపీ ఫ్రభుత్వం నిర్మించే ఇల్లు

by Anukaran |   ( Updated:2020-07-16 07:25:15.0  )
ఇదే.. ఏపీ ఫ్రభుత్వం నిర్మించే ఇల్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొదటగా ఈ నెల 8న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాల్సి ఉన్నా, కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. దీంతో ఆగష్టు 15వ తేదీన పంపిణీ చేయబోతున్నారు. అలాగే పేదల కోసం ప్రభుత్వం.. సెంటు భూమిలో ఇల్లు నిర్మించేందుకు సిద్ధమవుతోంది.

దీనికి సంబంధించి నమూనా ఇంటిని కూడా ప్రభుత్వం నిర్మించింది. అదే మోడల్ లో రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం ఉండబోతుందని ప్రభుత్వం ప్రకటించింది. హాల్, బెడ్ రూమ్, కిచెన్, బాత్ రూమ్ అన్ని ఓ కుటుంబానికి సరిపోయే విధంగా డిజైన్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ప్రస్తుతం నమూనా చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story