- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా తగ్గుముఖం.. కోయంబేడు కలవరం
దిశ, ఏపీ బ్యూరో: గడిచిన 24 గంటల్లో 36 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. వైరస్ కారణంగా కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందినట్లు తెలిపింది. 9,256 శాంపిల్స్‌ను పరీక్షించగా 9220 నెగెటివ్ రాగా, 36 పాజిటివ్ వచ్చాయని ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 2100 చేరుకుంది. తాజాగా నమోదైన 36 కేసుల్లో 21 మంది బాధితులకు తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లివచ్చిన వారు కావడం గమనార్హం. 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 15 కేసులు నమోదు కాగా అందులో 12, చిత్తూరులో 9 కేసులు నమోదుకాగా 8, పశ్చిమగోదావరిలో నమోదైన ఒక్క కేసు కూడా కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వారని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో చెన్నై వెళ్లి వచ్చిన వారందరి సమాచారాన్ని అధికారులు సేకరించి క్వాంరంటైన్‌కు తరలిస్తున్నారు.
కోయంబేడు మార్కెట్ కేసులను మినహాయిస్తే కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదించినట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూ కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే హాట్‌స్పాట్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఒక్క జిల్లాలోనే 591 నమోదయ్యాయి. అయితే, ఊరటనిచ్చే అంశం ఏమిటంటే 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కర్నూలుతోపాటు అనంతపూర్, తూర్పుగోదావరి, ప్రకాశం, విశాఖపట్టణం, విజయనగరంలో కూడా ఎలాంటి కేసులు లేవు. ఇప్పటివరకు నమోదైన 2100 కేసుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన బాధితులు 105 మంది (మహారాష్ట్ర, గుజరాత్ 26, ఒడిశా 10, పశ్చిమబెంగాల్, కర్ణాటక 1) ఉన్నారు. మొత్తం కేసుల్లో 1192 మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగా, 860 మంది చికిత్స పొందుతున్నారు. 48 మంది మృతిచెందారు.
సడలింపులపై మార్గదర్శకాలు
కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ సడలింపులపై గురువారం రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. పాలు, పండ్లు, కూరగాయలు విక్రయించేందుకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, ఇతర దుకాణాలను తెరుచుకోవడానికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇచ్చింది. కానీ, కంటైన్‌మెంట్, బఫర్‌జోన్లలో మాత్రం అనుమతి లేదు. షాపింగ్ మాల్స్, బంగారు ఆభరణాలు, బట్టలు, చెప్పుల దుకాణాలను ఎక్కడా తీయడానికి వీల్లేదు. దుకాణాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలని, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.