- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసోలేషన్ వల్ల మనుషులకే కాదు ‘చీమల’ ఆరోగ్యానికి ప్రమాదమే!
దిశ, ఫీచర్స్ : మహమ్మారి మనుషులను ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా ఆరోగ్యపరంగానూ ఒత్తిడిలోకి నెట్టిన విషయం తెలిసిందే. ఇక ఐసోలేషన్ ప్రభావంతో ఇప్పటికీ ఎంతోమంది డిప్రెషన్ నుంచి బయటకు రావడం లేదు. అయితే చీమలను కూడా తమ గుంపుల నుంచి వేరుచేసి ఒంటరిగా ఉంచడం వల్ల మానవులు, ఇతర క్షీరదాల మాదిరిగానే ప్రతిస్పందిస్తాయని కొత్త అధ్యయనంలో వెల్లడైంది. వాటి సామాజిక ప్రవర్తన, రోగనిరోధక వ్యవస్థ, స్ట్రెస్ జీన్స్(ఒత్తిడి జన్యువు)ను కూడా ప్రభావితం చేస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ రీసెర్చ్ తాజాగా మాలిక్యులర్ ఎకాలజీలో ప్రచురితమైంది.
‘టెమ్నోథొరాక్స్ నైలాండెరి’ జాతికి చెందిన చీమల్లో ‘సోషల్ ఐసోలేషన్’ పరిణామాలను పరిశోధకులు తాజాగా విశ్లేషించారు. ఈ చీమలు ఐరోపా అడవుల్లోని ఓక్ పండ్లు, కర్రల్లో కావిటీలను ఏర్పరుస్తాయి. ఇవి ఎప్పుడు కూడా సమూహాలుగా జీవిస్తాయి. అయితే 14 కాలనీల్లో నివసించే చీమల నుంచి కొన్నింటిని తీసుకెళ్లిన పరిశోధకులు.. గంట నుంచి 28 రోజుల వరకు వేర్వేరు సమయాల పాటు ఐసోలేషన్‌లో ఉంచారు. ఆ తర్వాత సదరు చీమలను వాటి అసలు కాలనీల్లోకి పంపినపుడు యంగ్లింగ్ల్స్(పిల్లచీమలు)తో ఎక్కువ సమయం గడిపినట్లు గుర్తించిన పరిశోధకులు.. ‘అడల్ట్’ కాలనీ మేట్స్‌తో సమయం గడిపేందుకు తక్కువ ఆసక్తిని ప్రదర్శించినట్లు కనుగొన్నారు.
పరిశుభ్రతపై తక్కువ శ్రద్ధ..
చాలా కాలం పాటు ఒంటరిగా ఉన్న తర్వాత అవి గ్రూమింగ్ కోసం తక్కువ సమయాన్ని వెచ్చించాయి. సాధారణంగా ఇతర సామాజిక జీవుల్లో సామాజిక లేమి వల్ల ఈ తరహా ప్రవర్తన చూస్తామని పరిశోధకుల అభిప్రాయం కాగా.. పరిశుభ్రత విషయంలోనూ అంతగా ఆసక్తి చూపించలేకపోయాయని వారు తెలిపారు.
జన్యు కార్యకలాపాల్లో మందగమనం..
చీమల జన్యు కార్యకలాపాల్లోనూ పరిశోధకులు తేడాలను గమనించారు. రోగనిరోధక వ్యవస్థ పనితీరు, ఒత్తిడి ప్రతిస్పందనకు సంబంధించిన అనేక జన్యువులు సాధారణం కంటే తక్కువ చురుకుగా ఉన్నట్లు గుర్తించారు. కాగా చాలా కాలం పాటు ఒంటరిగా ఉన్న ఇతర సామాజిక జంతువుల్లోనూ ఇలాంటి చర్యే కనిపిస్తుంది.
క్షీరదాల మాదిరిగానే చీమలు ఒంటరిగా ఉండటం వల్ల ప్రభావితమవుతాయని మా అధ్యయనం చూపిస్తుంది. ఇది సామాజిక శ్రేయస్సు, ఒత్తిడి, సహనం, రోగనిరోధక శక్తి సామర్థ్యం వంటి అంశాల మధ్య సాధారణ సంబంధాన్ని సూచిస్తుంది. ఐసోలేషన్ వల్ల రోగనిరోధక వ్యవస్థ తక్కువ సమర్థవంతంగా పనిచేస్తుందని స్పష్టంగా అర్థమైంది.
– ప్రొఫెసర్ సుసాన్ ఫోయిట్జిక్