మంచినీటి ఇక్కట్లు..ఖాళీ బిందెలతో మహిళల నిరసన

by Jakkula Mamatha |
మంచినీటి ఇక్కట్లు..ఖాళీ బిందెలతో మహిళల నిరసన
X

దిశ, కడప:ఓట్ల కోసం వచ్చినప్పుడు అమ్మలారా అక్కలారా అని ఓట్లు దండుకుంటారు. మా సమస్య తీర్చరా అంటూ మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామ మహిళలు ఖాళీ బిందెలతో మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సిద్ధవటం మండలం మాధవరం మేజర్ గ్రామపంచాయతీ మహబూబ్ నగర్ నందు సోమవారం ఆ ప్రాంత మహిళలు మంచినీటి సమస్య పై ఆందోళనకు దిగారు. ఎన్నికల ప్రచారంలో మంచినీటి సమస్య పూర్తిగా నెరవేరుస్తామని చెప్పి ఓట్లు దండుకున్నారని మళ్లీ ఐదు సంవత్సరాలకు మంచినీటి సమస్య తీరుస్తారా అంటూ ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆ ప్రాంత మహిళలు మాట్లాడుతూ ఎలక్షన్ వచ్చినప్పుడు అందరూ నాయకులే అంటూ ఇంటింటికి వచ్చి మా ఓట్ల కోసం ప్రదక్షిణలు చేసిన ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కంటికి కనపడలేదని అన్నారు. నీటి సమస్య పరిష్కారం చేయని నాయకులు ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ట్యాంకర్లతో నీటి సరఫరా చేసినా కూడా ఏ మాత్రం సరిపోలేదని ఇండ్లలో ఉన్న మంచినీటి కుళాయిలకు నీళ్లు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మాధవరం మేజర్ గ్రామ పంచాయతీలో నీటి సమస్య ఎక్కువైపోయిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ అధ్యక్షులు డాక్టర్ వీరభద్రుడు, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి హరి ప్రసాద్ పాల్గొన్నారు

సమస్య పరిష్కరిస్తాం..

నీటి సమస్య పై సిద్ధవటం మండల అభివృద్ధి అధికారి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మాధవరం మేజర్ గ్రామపంచాయతీలో నీటి కొరత సమస్య మా దృష్టికి వచ్చిందని అన్నారు .కొంతమంది సిద్ధవటం పెన్నా నది నుండి వచ్చే మంచినీటి పైపులకు అక్రమ కనెక్షన్లు తీసుకున్నట్టుగా నిర్ధారించామని అవన్నీ తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మహబూబ్ నగర్ నందు గేటు వాల్స్ మరమ్మతులకుఆర్ డబ్ల్యూఎస్ డిపార్ట్ మెంట్ దృష్టికి తీసుకెళ్లామని సమస్య పరిష్కారం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed