కడపలో చెత్త పన్ను రచ్చ.. ఎమ్మెల్యే వర్సెస్ మేయర్

by srinivas |   ( Updated:2024-08-26 14:49:38.0  )
కడపలో చెత్త పన్ను రచ్చ.. ఎమ్మెల్యే వర్సెస్ మేయర్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో గత ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను భారం మోపిన విషయం తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేసింది. కానీ మేయర్ సురేశ్ బాబు మాత్రం ఆ దిశగా అడుగులు వేయడంలేదు. పన్ను చెల్లించకపోతే ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించొద్దని పారిశుధ్య కార్మికులను ఆదేశించారు. చెత్త పన్ను వసూలు చేయొద్దని ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి అధికారిక ఆదేశాలు రాలేదని మేయర్ అంటున్నారు.

దీంతో ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన కడప కౌన్సిల్ సభలో మేయర్‌ సురేశ్‌ బాబును ఆమె నిలదీశారు. ప్రభుత్వం చెత్త పన్ను రద్దు చేసిందని, ఎందుకు సేకరణ చేయడంలేదని మండిపడ్డారు. దీంతో మేయర్, ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం నడిచింది. చెత్త పన్నుపై ఎమ్మెల్యే మాధవీరెడ్డి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మేయర్ సురేశ్ బాబు మండిపడ్డారు. క్లీన్ కడప లక్ష్యంగా పని చేస్తున్నామని మేయర్ సురేశ్ చెప్పారు.

అయితే కడప ప్రజలు చెత్త పన్ను కట్టొద్దని ఎమ్మెల్యే మాధవీరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. చెత్త తీసుకెళ్లి మేయర్ ఇంటి ముందు పడేయాలని పిలుపునిచ్చారు. చెత్త సేకరించాల్సి బాధ్యత కడప కార్పొరేషన్‌పై ఉందన్నారు. చెత్త సేకరణకు వెళ్లకుండా వాహనాలను తగ్గించేందుకు మేయర్ కుట్ర పన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed