అసెంబ్లీ సమావేశాల వేళ.. అన్న జగన్‌పై షర్మిల సంచలన ట్వీట్

by srinivas |
అసెంబ్లీ సమావేశాల వేళ.. అన్న జగన్‌పై షర్మిల సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఐదు బిల్లులను సభలో ప్రవేశ పెట్టనున్నారు. అయితే ఈ సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరవుతున్నారు. దీంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరును కాంగ్రెస్ పార్టీ స్టేట్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తప్పుబట్టారు. అలాగే కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెపైనా ఆమె విమర్శలు చేశారు. ఈ మేరకు తాజాగా సంచలన ట్వీట్ చేశారు.

‘‘ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది జగన్ తీరు. బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కానీ బడ్జెట్ అని, YCP కంటే ముందుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం. మేము చెప్పిందే జగన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మీకు మాకు పెద్ద తేడా లేదు. జగన్‌కి 38 శాతం ఓట్లు వచ్చినా.. అసెంబ్లీకి వెళ్ళనప్పుడు, మీకు మాకు తేడా లేదు. 38 శాతం ఓట్ షేర్ పెట్టుకొని అసెంబ్లీకి పోనీ YCP నీ నిజానికి ఒక "ఇన్ సిగ్నిఫికెంట్"పార్టీగా మార్చింది జగన్ మోహన్ రెడ్డి. అసెంబ్లీలో అడుగు పెట్టలేని, ప్రజా సమస్యల కోసం సభల్లో పట్టుబట్టలేని, పాలకపక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని , అసమర్థ వైసీపీ ఇవ్వాళ రాష్ట్రంలో అసలైన "ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ". ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు. సొంత మైకుల ముందు కాదు. అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని. మీకు చిత్తశుద్ది ఉంటే.. నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయండి.’’ అని షర్మిల ట్వీట్ చేశార.

‘‘ప్రతిపక్షం కాకపోయినా..11 మంది ప్రజాపక్షం అనిపించుకోండి. ఇంకా అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయండి. ఎన్నికలకు వెళ్ళండి. అప్పుడు ఎవరు ఇన్ సిగ్నిఫికెంట్.. ఎవరు ఇంపార్టెంట్ తేలుతుంది కదా. YCP ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలి. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపుపై ప్రశ్నించడం.’’ అని షర్మిల సూచించారు.

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story

Most Viewed