- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BIG SHOCK: కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని, వల్లభనేని
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికల కౌంటింగ్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. వాళ్లిద్దరూ పోటీ చేసిన గుడివాడ, గన్నవరం స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు భారీ ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో లెక్కింపు కేంద్రం నుంచి ఆ ఇద్దరు నేతలు బయటకు వెళ్లిపోయారు. కాగా వల్లభనేని వంశీ, కొడాలి నాని గతంలో టీడీపీలో పని చేశారు. టీడీపీ ఎమ్మల్యేలుగా గెలిచారు. గత రెండు ఎన్నికల్లో కొడాలి నాని వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గన్నవరం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీని వీడి వీడి వైసీపీకి మద్దతు ప్రకటించారు. అసెంబ్లీలో సైతం తెలుగుదేశం ఎమ్మెల్యేలతో కాకుండా వంశీ సపరేట్‌గా కూర్చుకున్నారు. ఆ తర్వాత కాలంలో టీడీపీ నేతలపై దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్‌లో కొడాలి నాని, వంశీ వెనకంజలో కొనసాగుతున్నారు. దీంతో ఇద్దరూ కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.