పొత్తు రాజకీయాల ధ్యేయమేంటి..? ప్రజాసేవ..?ప్రత్యర్థులను ఓడించడమా..?

by Indraja |
పొత్తు రాజకీయాల ధ్యేయమేంటి..? ప్రజాసేవ..?ప్రత్యర్థులను ఓడించడమా..?
X

దిశ డైనమిక్ బ్యూరో: రానున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీతో జనసేన పొత్తు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఇక బీజేపీతో కూడా టీడీపీ పొత్తు దాదాపు ఖరారైనట్టే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భహిరంగ సభల్లో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో తాను ఓడిపోయినా పర్వాలేదు కానీ వైఎస్ జగన్ మాత్రం అధికారం లోకి రాకూడదు అని వక్కాణించి చెబుతున్నారు. అందుకే తాను టీడీపీతో పొత్తు కలుపుకున్నట్లు వెల్లడిస్తున్నారు.

దీనితో ప్రజాసేవ చెయ్యడానికి రాజకీయాల్లోకి వచ్చారా..? లేక జగన్ ఓటమిని చూడడానికి వచ్చారా..? తాను అధికారం లోకి వస్తే ప్రజలకు చేసే మంచి గురించి మాట్లాడకుండా.. జగన్ ఓటమి గురించి మాట్లాడండంలో అర్ధముందా అని కొందరు ప్రశ్నింస్తున్నారు. అలానే నాకు ఒక్క కన్నుపోయిన పర్లేదు కానీ ఎదుటి వ్యక్తికి రెండు కళ్ళు పోవాలని కోరుకున్నట్లు ఉంది పవన్ తీరు అని ఎద్దేవ చేస్తున్నారు.

అయితే ఇలా పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడుతున్న పవన్ వ్యతిరేకదారులకు పవన్ అభిమానులు గట్టి కౌంటర్ ఇస్తూ.. పవన్ ఏ ఉద్దేశంతో ఆలా మాట్లాడారో.. ఆ మాటల్లోని అతర్యమేందో పవన్ యాంటీ ఫనన్ కి తెలియ చేస్తున్నారు. జగన్ అదికారం లోకి వచ్చాక రాష్ట్రంలో అంధకారం అలుముకుందని.. ఆ చీకటిని తరిమేసే వేకువలా ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రజలు తమకు మంచి చేసే నాయకులు ఎవరు అనే విషయాన్ని కూలంకషంగా ఆలోచించుకుని ఓటు వేయాల్సిందిగా పవన్ ప్రజలకు పిలుపినిచ్చారు.

అలానే ఒక్క ఛాన్స్ అని వచ్చిన జగన్ రాష్ట్రాన్ని నిలువునా అప్పుల్లో ముంచి.. యువతకు ఉపాధి లేకుండా చేశారని.. ప్రశ్నించిన గోతులను శాశ్వతంగా మూసివేశారని అందుకే.. ప్రజలు తనకి ఓటు వెయ్యకున్న పర్లేదు కానీ.. రాష్ట్రంలో నియంత పాలనను తలపిస్తున్న జగన్ పరిపాలనకు స్వస్తి పలకాలని పవన్ ఉద్దేశం అని ఆయన అభిమానులు తెలిపారు. ఇలా పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి యాంటీ ఫాన్స్ కి నిత్యం సోషల్ మీడియా వేదికగా కామెంట్ల యుద్ధం సాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed