VUPPC: మరోసారి విశాఖ ఉక్కు ఉద్యమం

by srinivas |   ( Updated:2023-03-16 13:18:03.0  )
VUPPC: మరోసారి విశాఖ ఉక్కు ఉద్యమం
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై రెండేళ్లుగా పోరాటాలు చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం సరికాదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి. ఆదినారాయణ అన్నారు. విశాఖ పౌర గ్రంధాలయంలో విలేకరులతో మాట్లాడారు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్రప్రభుత్వం శతశాతం వాటాల విక్రయ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డి.ఆదినారాయణ కోరారు. రాష్ట్రంలో ఎంపీలకు, కేంద్ర స్టీల్ కన్సల్టేషన్ కమిటీ సభ్యులకు లేఖలు రాశామని పేర్కొన్నారు. కేంద్రం విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం ప్రకటించినప్పటి నుంచి 760 రోజులుగా పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నా, ఎంపీలు నిలదీస్తున్నా మోదీ సర్కార్ పట్టు వీడకుండా ఎందుకుందో అంతు పట్టడం లేదన్నారు. కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచన మానుకోపోతే ఉక్కు ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

ఈ సమావేశంలో కమిటీ కో కన్వీనర్ నీరుకొండ రామచంద్రరావు, అయోధ్య రామ్, దుమ్మెటి అప్పారవు, రమణారెడ్డి పడాల రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed