- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అల్లూరి జిల్లా కేంద్రంగా నర్సీపట్నం?
దిశ ప్రతినిధి, పాడేరు: అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రంగా పాడేరుకు బదులు నర్సీపట్నం పేరును ప్రతిపాదించడంపై గిరిజనుల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. గిరిజనులు ఉధృతంగా ఉద్యమం చేయాడానికి సిద్ధమవుతున్నారు. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచినప్పటికీ అభివృద్ధికి నోచుకోని గిరిజన ప్రాంతం ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పడి జిల్లా కేంద్రంగా ఆదివాసి ప్రాంతం అయిన పాడేరు ఉండటంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని గిరిజనులు సంతోషించారు. కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవకుండా ఇప్పుడు అల్లూరి జిల్లాకు నర్సీపట్నం కేంద్రంగా చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నిర్ణయానికి జిల్లాలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో వివిధ రకాల నిరసనల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకత తెలియజేయాలని గిరిజన సంఘాల నిర్ణయించాయి.
తీవ్ర వ్యతిరేకత..
మొత్తం 30 జిల్లాలతో రాష్ట్రాన్ని పునర్విభజన చేయడానికి ప్రతిపాదనలు చేశారు. అయితే ప్రస్తుతం అల్లూరు జిల్లా కేంద్రంగా పాడేరు ఉండటంతో పరిపాలన, సపోర్టు దగ్గర నుంచి దొరుకుతుందని గిరిజనులు భావించారు. కానీ ఇప్పుడు జిల్లా కేంద్రం నర్సీపట్నంకి తరలిస్తామనడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇటీవల సర్కులేట్ చేసిన నోట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించడం వివాదానికి కారణమైంది.