- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chandrababu BirthDay: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, ఉత్తరాంధ్ర: టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినోత్సవం విశాఖలో ఘనంగా జరిగింది. టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు రక్తదాన శిబిరం ప్రారంభించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో పాలిచ్చే ఆవుని కాదని, తన్నే దున్నను తెచ్చుకున్నామని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం రోజులు లెక్క పెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని హెచ్చరించారు. నాలుగేళ్ల పాలనలో ఒక్క ఇటుక కూడా వేయలేకపోయారని విమర్శించారు. ఎన్నికల ఏడాదిలో పోర్టు, ఎయిర్ పోర్ట్ కడతానని కల్లబొల్లి కబుర్లు చెప్పి నమ్మిస్తున్నారని గంటా వ్యాఖ్యానించారు. అవినీతి, అక్రమాలు, అన్యాయాల్లో మొదటి స్ధానంలో నిలబడిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనన్నారు. అస్ధవ్యస్ధ పాలను గాడిలో పెట్డడానికి మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి కాబోతున్నారని గంటా జోస్యం చెప్పారు.
తాను కూడా ఒక విద్యార్ధిని దత్తత తీసుకుంటాననని విశాఖపట్నం పార్లమెంట్ ఇంచార్జ్ ఎం శ్రీభరత్ మాట్లాడుతూ మళ్లీ ఏడాది నాటికి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని ఆశిస్తున్నానని చెప్పారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు చంద్రబాబు పాలననే కోరుకుంటున్నారని తెలిపారు.
దక్షిణ ఇంచార్జ్ గండి బాబ్జీ మాట్లాడుతూ పార్లమెంటులో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ గెలవబోతోందని సర్వేలు చెపుతున్నాయని చెప్పారు. ప్రజల తరపున మరింత నిలబడి పోరడాల్సిన అవసరం ఉందన్నారు.
పల్లా మాట్లాడుతూ పేద విద్యార్ధిని దత్తత తీసుకోవాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో పెదగంట్యాడకు చెందిన ఓ పేద కుటుంబాన్ని దత్తత తీసుకుంటున్నామని చెప్పారు. ఇంజనీరింగ్ కాలేజీ పాలసీని మార్చి విద్యార్థులకు మేలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు
ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు మాట్లాడుతూ ఏపీకి దశ దిశ చంద్రబాబు నాయుడే అని చెప్పారు. ఉమ్మడి ఏపీకి హైటెక్ సిటీని అందించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. బెంగళూరుకు మించిన స్ధాయిలో హైదరాబాద్‌ను ఐటీ రంగంలో తీర్చిదిద్దారని కొనియాడారు. బిల్ గేట్స్ లాంటి వ్యక్తిని హైదరాబాద్ వేదికపైకి తీసుకు వచ్చిన ఘనుడు చంద్రబాబు అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం శాసనసభ సభ్యులు గణబాబు, ఉత్తర నియోజకవర్గం ఇంచార్జ్ చిక్కాల విజయ్ బాబు, రాజమండ్రి నారాయణ, పైల ముత్యాల నాయుడు, గొలగాని వీరారావు బుజ్జి, మొల్లి ముత్యాలు, బైరెడ్డి పోతన రెడ్డి, విల్లురి చక్రవర్తి, కాళ్ళ శంకర్, బొడ్డేపల్లి లలిత, తమ్మిన విజయకుమార్, కోట నరేష్, ఈసారపు వాసు, బుడుమూరి గోవింద్, అనసూరి మధు, గణగళ్ల సత్య, పొడుగు కుమార్, బండుబిల్లి సూర్యనారాయణ, అక్కిరెడ్డి జగదీష్, కోనేటి సురేష్, పలిశెట్టి అప్పన్న, వలిసెట్టి తాతాజీ, ఉరుకుటి గణేష్, ముల అప్పారావు తదితరులు పాల్గొన్నారు